మానవ జీవితంలో కర్తవ్య నిర్వహణ ముఖ్యం. ఈ ప్రపంచంలో మానవుడు కానీ, మృగాలు కానీ, పక్షులు కానీ ఏవైనా ఆకలిని జయించిన వారు ఎవరూ లేరు దానికోసమే అన్ని క్రిమి కీటకములతో సహా మానవుని వరకు ప్రతివాడు ప్రయత్నం చేయాలి లేకపోతే ఆకలితో మరణించక తప్పదు ఇది లోక న్యాయం మనం పల్లెల్లో కొంతమంది పెద్దల ద్వారా ఒక మాట వింటూ ఉంటాం వాళ్లు వట్టి జీవచ్ఛవం రా అంటూ ఉంటారు పెద్దలు వాడు బ్రతికే ఉన్నాడు కదా వాడిని శవం అంటారేమిటి అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది మన ముఖంలో వచ్చిన కవళికలను చూసి పెద్దలు ఆశ్చర్యపోకమానరు. దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలని తపన పడతారు. ఏమిట్రా నేను చెప్పింది చాలా గందరగోళంగా ఉందా ఏమీ అర్థం అయినట్లుగా లేదు నీ మొహం చూస్తే నాకు అలా అనిపిస్తుంది చూడప్పా మన గ్రామంలో పెద్ద ఆసామి రెండు అంతస్తుల మేడ కలిగిన వ్యక్తి తనకు పని చేయడానికి నౌకర్లు చాకర్లు అందరూ ఉన్నారు కదా జీవితం చాలా హాయిగా ఆనందంగా గడుస్తుంది ఎవరైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడి వారి దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం పడింది మీరు సహకరించండి మీరు ఇచ్చినది నేను త్వరలో మొత్తం తీరుస్తాను అని కాళ్లా వేళ్ళా బడి బ్రతిమాలాడినా అతని మనసు కరగదు. ఒకవేళ అతను తీసుకున్నది ఇవ్వలేకపోయినా వాడికి సాయం చేసానన్న ఆత్మ తృప్తి ఉంటుంది కదా. అది కూడా ఆలోచించలేని హృదయం కలవాడిని ఏమని పిలవాలి. అంత ఆస్తి ఉన్నవాడు తాను అనుభవించవచ్చు కదా చిన్న పంచగట్టి ఒక పై పంచేసుకొని తిరుగుతాడు కనీసం తాను తన కుటుంబ సభ్యులు సంతృప్తిగా భోజనం చేస్తారా అంటే అదీ లేదు. కూడబెట్టి కూడ పెట్టి ఏం చేస్తారు చివరకు ఎవరైనా కాటికి చేరవలసినదే కదా ఆ మాత్రం కూడా ఆలోచించరు. పిల్లలు కూడా బయటివారు ఏమనుకుంటారు అలా ఆలోచన కూడా లేకుండా చదువు చట్టు బండలు కూడా లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్లను ఏమని పిలవాలి ప్రత్యక్షంగా నీకు తెలిసిన ఉదాహరణ చెప్పనా ఇలాంటి వాళ్ళని జీవచ్ఛవాలు అంటారు. వాడు నిజానికి బ్రతికే ఉన్నాడు కానీ శవంతో సమానం ఇతరులకు సహాయం చేయకపోవచ్చు తనకు తాను కూడా సహాయం చేసుకోలేని దుస్థితి. అలాంటి వారికి ఉపయోగించే మాట అని వివరణ చెపుతున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి
"విడువ ముడువలేక కుడువ గట్టగలేక వెరవు లేక జరగలేక విద్య నొరయలేక వెడల లేనివాని నడుపీనుగందురో..."
"విడువ ముడువలేక కుడువ గట్టగలేక వెరవు లేక జరగలేక విద్య నొరయలేక వెడల లేనివాని నడుపీనుగందురో..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి