సహజంగా మానవతత్వం ఎలా ఉంటుంది అంటే తక్కువ పని చేయాలి ఎక్కువ ఫలితం రావాలి ఇలాంటి వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి గాలి మేడలు కడుతూ ఉంటారు ఒక మేడ కట్టాలి అంటే దానికి పునాదులు తీసి తగిన ఇటుక సిమెంటు ఇసుక లాంటివి ఏ పాళ్ళలో కలపాలో ఆ పని చేసే మేస్త్రిని కలిసి మాట్లాడుకుని ఆ ఏర్పాట్లు చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క రాతితో ఒక్కొక్క పద్ధతిలో గృహాన్ని నిర్మించాలి అది ఒక్కరి వల్ల జరిగే పని కాదు ఏ పని జరగాలన్న ఒక మంత్రం అంటే ఒక ఆలోచన ఒక మనిషికి రావాలి దానికి తంత్రం తోడు కావాలి ఏ పద్ధతిలో అది చేస్తే సులభంగా ఆ పని అవుతుంది అనగానే ముందు కాగితం మీద బ్లూ ప్రింట్ లాగా విషయం మొత్తం ఒకచోట రాతపూర్వకంగా ఉండాలి. తరువాత యంత్రం నీవు నిర్మించడానికి అన్ని పనులు ఒక్కడివే చేసుకోలేవు కనుక దానికి తగిన కూలీలు మేస్త్రీలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి నీళ్లు తీసుకువచ్చే కుర్రవాడితో సహా ప్రతి ఒక్కరూ అంకితభావంతో చేయాలి అలా కాకుండా ఏ ఎడారి ప్రాంతంలోనో ఒక గుంట తీసి అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుంది అది సాధ్యమయ్యే విషయమేనా ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం పరిస్థితులకు అనుకూలంగా లేని ఏ విషయాన్ని మనం సాధించలేము జీవితానికి దీనిని అన్వయించుకుంటే ఎందుకు జీవిస్తున్నాడు ఎందుకు మరణిస్తున్నాడు ఈ విషయాలను గురించి తెలుసుకోవాలి అంటే ముందు నేను ఎవరో తెలుసుకోవాలి ఆ బ్రహ్మ తత్వం నీకు తెలుసుకోకపోయినట్లయితే అసలు ఆలోచించడానికి నీవు పనికిరావు అని అర్థం.
బ్రహ్మ పదార్థాన్ని గురించి గానీ తత్వాన్ని గురించి గానీ తెలుసుకోవాలి అనుకుంటే అసలు ముందు తత్వం అంటే అర్థం తెలియాలి దానిని తెలియజేసే గురువు నీకు సన్నిహితంగా ఉండాలి ఆ గురువు మనసు విప్పి అంకితభవంతో నీతో నీ స్థితికి వచ్చి ఆ విషయాలన్నీ నీకు అర్థం అయ్యే పద్ధతిలో బోధించాలి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం అనేది బ్రహ్మకు కూడా వశం కాదు అని మన పెద్దలు చాలామంది చెబుతూ ఉంటారు ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి వాటిని అన్నిటినీ ఎదిరించి ముందుకు నడిచిన తాను తలచినది చేసినట్లయితే అతనికి తృప్తినివ్వడమే కాదు నీవు సాధించిన విజయాన్ని తెలిసిన ప్రతి ఒక్కరూ నిన్ను అభినందించక మానరు అంటాడు వేమన ఆ పద్యాన్ని చదవండి ఒక మారు.
"తలప వశము గాదు తత్వంబు బ్రహ్మము తెలియలేదు బ్రహ్మదేవుడైన యిసుక బావిద్రవ్వ యవ్వరివశమయ్యా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి