మీ మనసులోమాట అన్న శీర్షిక తో అనేకమంది మనసులలో దాచుకున్న విషయాలను బయటకు తెచ్చి వీడియోలో భద్రపరిచాను ఆ కోవలో బొమ్మా రెడ్డి మామయ్యను కూడా వీడియో చేసి ఆయన్ని శాశ్వతంగా ఉంచుకోవాలన్న కోరికతో తేలప్రోలు నుంచి వచ్చి అనేక పత్రికలలో పనిచేసి విశాలాంధ్ర ప్రజాశక్తి అంటే బొమ్మా రెడ్డి అన్న స్థాయిలో రాగా మా గ్రామాన్ని నిలబెట్టినవాడు వారి మాటలు శాశ్వతంగా ఉండాలని ఇది నా కోరిక దాదాపు రెండు గంటల పై చిలుకు వారితో మాట్లాడి భోజనానికి కూర్చున్న వారి కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేయడం మొదటిసారి సరదాగా ఊరు కబుర్లు అన్నీ చెప్పుకుంటూ భోజనాలు ముగించి అరటి పండు కూడా తిన్న తర్వాత
చేయి కడగడానికి లేచి నిలబడి ఒక అడుగు వేయగానే ఏరా అల్లుడు నువ్వు తిన్న కంచం ఎవరు తీస్తారు రా దానికోసం ఓ పని మనిషిని పెట్టాలా దాన్ని తీసుకెళ్లి ఆ శింక్ లో పడవేయి అని చెప్పగానే నాకు కొంచెం సిగ్గు అనిపించింది ఆ క్షణం వరకు నాకు ఆ అలవాటు లేదు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎక్కడ భోజనం చేసినా ఆ పద్ధతిని అవలంబిస్తున్నాను అలా కుటుంబ సభ్యులతో పాటు బయట వారిని కూడా క్రమశిక్షణతో నడపగలిగిన సామర్థ్యం కలిగిన చక్కటి వామపక్ష పాతి ఆయన దగ్గర నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి పార్టీలో అంత క్రమశిక్షణతో మెలిగిన వ్యక్తి సుందరయ్య గారి తరువాత ఆయనేనేమో.
అప్పో విప్పో వారు నాటకోత్సవాలను జరిపిన సందర్భంలో నేను నిర్వాహకునిగా పనిచేశాను అప్పుడు మామయ్యను ఒక న్యాయ నిర్ణేతగా ఉండమని అడిగితే నేను మంచి ప్రేక్షకుణ్ణి తప్ప మంచి న్యాయ మూర్తిని కాదు నేను కనుక అంగీకరిస్తే తప్పులను అంగీకరించినట్లే అని సమాధానం మానసిక విశ్లేషకుల మాటల్లో తనను తాను తెలుసుకోవడానికి మించిన గొప్ప వేదాంతం మరొకటి లేదు ఏ కార్యాన్ని నేను నిర్వహించగలను నిర్వహించలేను అని నిర్ణయించుకున్న వాడే గొప్ప మానసికవేత్త నా దృష్టిలో అలాంటి సాహితీవేత్త మానసిక విశ్లేషకులు మా గ్రామ వాసులు కావడం మా సన్నిహిత బంధువులు కావడం మాకు చాలా ఆనందం.
మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి