చాలామందికి ఉన్న అభిప్రాయం వేదాంతము, తత్వము అనే శబ్దాలు వింటే ఇది మనకు సంబంధించింది కాదు వేదాంతులకు, సన్యాసులకు, మఠాధిపతులకు కావాలి అనుకోవడం సహజం అసలు వేదాంతము లేక తత్వము అన్న శబ్దాలకు అర్థం తెలిస్తే అపోహలు తొలగిపోతాయి తత్వం అంటే ఏదైతే ఉన్నదో అది నేనే అన్న విషయాన్ని వేదాంతము అంటే విత్ అంత్ నీవు ఏ వేదమైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాని తర్వాత చేయవలసిన పని ఏమిటి అని ఆలోచించడం వేదాంత ప్రక్రియగా జిడ్డు కృష్ణమూర్తి గారు అనేక పర్యాయాలు మనకు చెప్పారు దానికోసం వారు ఎంతో పరిశ్రమించి ఒక పరిణతి చెందిన పరిపూర్ణ అభిప్రాయానికి వచ్చిన యోగి పుంగవులు ఆయన. ఆ రెండు శబ్దాల మూలాలను తెలుసుకోవడానికి అనేక శాస్త్రాలు మనకు లభ్యం అవుతున్నాయి వాటిని చదివినంత మాత్రం చేత మనకు అర్థమయ్యే పరిభాష కాదు అది వేద భాష. మన సాహిత్య భాషకు సంబంధం లేదు పరిణతి చెందిన వ్యక్తుల మస్తిష్కం నుంచి ఉద్భవించిన విషయాలు ఆ వేదాంత విషయాలు పరిణతి అన్న శబ్దానికి అర్థం తెలియని మనకు ఆ పరిపక్వమైన పూర్తి అర్థం తెలియడానికి అవకాశమే లేదు అందువలన దాని లోతు తెలిసుకోవాలి అన్న అభిప్రాయం నీకు కలిగినప్పుడు దానిని పూర్తిగా అధ్యయనం చేసిన యోగి పుంగవుని వద్దకు వెళ్లి వారి శిష్యునిగా చేరి తనకు ఏ శంకలు అంటే అనుమానాలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి చేసే సాధన మొదట చేయాలి ఒక ఋషి నీకు విద్య నేర్పడానికి అంగీకరించినట్లయితే వారు కాగితం పెన్ను తీసుకుని అక్షరాలను గీకి చెప్పే పద్ధతి వారికి నచ్చదు అసలు ఋషి అంటేనే చరించేవాడు సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో దానిని యధాతధంగా జీవితంలో తాను అనుసరిస్తూ దానికోసమే జీవితాన్ని అర్పణ చేసినటువంటి వ్యక్తి వారు ఏ పని చేస్తున్నారో ఆ పని మనం చేయడానికి ప్రారంభిస్తే నీకు తెలియని ఎన్నో సంప్రదాయాలు మన సంస్కృతి వేదాలలో ఉన్న ప్రతి అక్షరం నీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది.అలాంటి గురువు నీకు దొరికినట్లైతే వారు దైవంతో సమానం
కనుక అలాంటి ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని వేమన మనకు తెలియజేస్తూ చక్కటి పద్యాన్ని అందించారు అది చదువుదాం.
"సద్గురు కృప జ్ఞానంబున సద్గతి దీపింపుచున్న చాలా చదువుల్ సద్గతి గలుగగ జేయును సద్గురువే దైవ మనుచు జాటర వేమ..."
కనుక అలాంటి ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని వేమన మనకు తెలియజేస్తూ చక్కటి పద్యాన్ని అందించారు అది చదువుదాం.
"సద్గురు కృప జ్ఞానంబున సద్గతి దీపింపుచున్న చాలా చదువుల్ సద్గతి గలుగగ జేయును సద్గురువే దైవ మనుచు జాటర వేమ..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి