శనగల విశ్వనాథ రెడ్డి గారి పేరు అందరికీ తెలిసిందే. వామపక్ష సిద్ధాంతాలను గన్నవరం తాలూకాలో ఉన్న చాలామందికి ప్రచారం చేసి ఎంతోమంది సభ్యులను చేర్చిన వారు వారి అబ్బాయి అశోక్ నాతో పాటు చదివిన వాడు మంచి స్నేహితుడు వాడి తమ్ముడు విద్యాసాగర్ వాళ్ల కుటుంబం మొత్తం పార్టీ సిద్ధాంతాలతో కట్టుబడి ఉంది అశోక్ మంచితనాన్ని చూసి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాం అలా విశ్వనాథ రెడ్డి గారు మాకు వియ్యంకుడు అవుతాడు చిన్నతనం నుంచి మా అందరి అభివృద్ధిని కోరి పాటిబండ శ్రీమన్నారాయణ గారి నిర్వహణలో మా అందరినీ ఒకచోట చేర్చి మాకు విద్యాబుద్ధులు చెప్పించిన వాడు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డల్లాగా ఆప్యాయంగా చూసే వ్యక్తి.1939-40 సంవత్సరం ప్రాంతంలో వెల్లంకి వెంకటేశ్వరరావు (పొట్టి పాడు) ముక్కామల నాగభూషణం ఆత్కూరు పుట్టగుంట నాగభూషణం గారు తేలప్రోలు వచ్చి శనగల విశ్వనాథరెడ్డి వింత అప్పిరెడ్డిని కలిసి కమ్యూనిస్టు పార్టీ దాని సిద్ధాంతాలను వివరించి వారిరువురిని మొదటి తరం మొదటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేర్చుకున్నారు గన్నవరం ప్రాంత యూనిట్లలో తదాదిగా వీరు ఇరువురు కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా పనిచేస్తూ వచ్చారు. విశ్వనాథ రెడ్డి యువజన సంఘ ప్రెసిడెంట్ తర్వాత చాలా సంవత్సరాలు తాలూకా రైతు సంఘ ప్రెసిడెంట్ గా పని చేశారు తేలప్రోలు యూనిట్ సెక్రెటరీగా తాలూకా కమిటీ సభ్యులుగా సెక్రటరీగా కూడా పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు జొన్నపాడు నుంచి కాలినడకన వచ్చి విశ్వనాథరెడ్డి వింత గుంటకపుల్లా రెడ్డిని కలిసి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు తదితర విషయాలు మొదటి పరీక్షలు చేసింది ఒరేయ్ అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు 1932వ సంవత్సరంలో విశ్వనాథరెడ్డి తన 16 వయేట ఫోర్థ ఫరం పరీక్షలు రాసి తిరిగి వచ్చారు స్వాతంత్ర్య సమరయోధులైన ఆరుమళ్ళ సుబ్బారెడ్డి గారితో పరిచయం ఏర్పడి వందేమాతరం మనదేరాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి అనే నినాదం రాసుకొని గ్రామాలలో అంపాపురం స్టేషన్ కు వెళ్లి రైలులో ఆ కరపత్రాలను కూడా పంచి పెట్టడం లాంటి పనులు చేశారు అప్పటికే మా నాన్న సుబ్బారెడ్డి గారు జైలు శిక్ష అనుభవించి వచ్చారు.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి