వన్నె వన్నెల వసంతం
వయ్యారం గా కదలి వచ్చి
మనసులో అలజడి రేపింది
గ్రీష్మం తాపం రేకెత్తించి
అలజడి మంటలు పెంచింది
చల్లని అమృత ధారలతో
వర్షం తన ఆలింగనం లో
ముంచెత్తింది
శరత్ చంద్రికా చల్ల దనం
మృదువుగా స్ప్రుసిస్తూ
మధురం గా
హేమంతము లోకి
లాక్కెళ్ళింది.
హేమంతము వీడుకోలు
పలుకుతూ
శిశిరం లోకి నెట్టేసింది
విరహం తో మోడువారిన
శిశీరాన్ని వెడుకొలుతో చూసా
నా చేయి పట్టుకుని నడిచి
మరో నూతన వసంతంని
చూపించింది.
ఆరు ఋతువులు నాలో
ఆరు అనుభూతులు
మిగిల్చాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి