జయ జయ వరలక్ష్మి; - "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098
 👌ఇష్ట కామ్యార్ధములను
 నెరవేర్చు కల్పవల్లి!
     జయజయ వరలక్ష్మి!
 లలితాoబ! జగదాంబ!
    ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 👌శ్రీమాత... సర్వ సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మున్నగునవి... సంపదలే!
       "వర" అంటే శ్రేష్ఠమైనది! "లక్ష్మి" అంటే సర్వ లక్షణయుక్తమైనది, అని విశేషార్థం! శ్రీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకుంటే; కోరిన వరములను అనుగ్రహించుతుంది! కనుక, జగన్మాతకు "వరలక్ష్మీ దేవి" అని పేరు!
👌మాహేశ్వరీ! మహాదేవీ! "మహాలక్ష్మీ"! మృడప్రియా! అని, శ్రీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము నందు, వశిన్యాది వాగ్దేవతలు శ్రీమాతను ప్రస్తుతించారు!
       ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవరలక్ష్మ్యై నమః!
       🚩 చంపక మాల 
     వరములనిచ్చు తల్లి! శుభవర్ష పరంపరలిచ్చు తల్లి! సు
      స్థిర సుఖశాంతి సంపదలు సిద్ధిలచేసెడి కల్పవల్లి! శ్రీ
      కర ధనధాన్య గేహ కనకమ్ముల నిచ్చెడి కన్నతల్లి! స
       త్కరుణను గావుమమ్మ! జయకారిణి! శ్రావణి ! విష్ణుకామినీ!!
          (... మైలవరపు మురళీకృష్ణ.,)

కామెంట్‌లు