న్యాయాలు -219
రామఠ కరండ న్యాయము
******
రామఠ అంటే ఇంగువ.కరండము అంటే చిన్న పెట్టె, కత్తి,కరాటము,తేనెపెర అని అర్థాలున్నాయి.
ఇంగువ పెట్టెలోని యింగువ తీసేసినా కూడా దాని వాసన ఆ పెట్టెకు అంటుకుని ఎప్పటికీ పోదు.
అలాగే ప్రముఖ వ్యక్తులు ఏవో కొన్ని కారణాలు ,ఇబ్బందుల వల్ల ఆస్తిపాస్తులూ ,పూర్వ వైభవాన్ని కోల్పోయినా వారికి ఇంతకు ముందు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎక్కడికీ పోవు అనే అర్థంతో ఈ "రామఠ కరండ న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
దీనినే తెలుగులో "ఇంగువ కట్టిన గుడ్డ "అనే జాతీయంతో పోలుస్తూ ఉంటారు.
మరి ఇంగువ కట్టిన గుడ్డనే ఉదాహరణగా ఎందుకు తీసుకోవాలి? మరేదైనా తీసుకోవచ్చు కదా? అనిపించడం మీతో పాటు నాకూ అనిపించింది. కానీ వంటింట్లో ఇంగువ ఉన్న డబ్బా కోసం మనం వెతుక్కోనక్కర లేదు కదా!. అదే ఘాటైన వాసనతో ఫలానా చోట ఉన్నానని పసిగట్టిస్తుంది.చాలా దూరం నుండే నాసికా పుటాలకు సోకుతుంది.అంటే చాలా దూరం వ్యాపిస్తుందన్న మాట.
మూత పెట్టిన డబ్బాలోంచే తన ఉనికిని చాటుకునే ఇంగువ ఇక గుడ్డలో మూట కడితే ఆగుతుందా ?అంతకన్న ఎక్కువగా ఆ మూట కట్టిన గుడ్డ నిండా అణువణువునా అలుముకుంటుంది.దానిలోని ఇంగువను తీసి మనం వాడుకున్నా ఆ గుడ్డకు అంటుకున్న వాసన ఒక పట్టాన పోదు.చాలా కాలం దాకా ఆ గుడ్డ ముక్క ఇంగువ వాసనే వేస్తుంది.
అందుకే ఎంతో గొప్ప వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఆ తర్వాత్తర్వాత ఆ రంగానికి దూరమైనా,ఆర్థికంగా చితికిపోయినా ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఎక్కడికీ పోవనీ .ఇంగువ లేకున్నా వాసన పోని ఇంగువ మూట కట్టిన గుడ్డలా ఆయన వెంటే వుంటాయని అంటారు.
ఇదే కాకుండా మరో కోణంలో చూస్తే " మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి." అన్నట్లు . వాళ్ళ వారసులుగా ఇంగువ కట్టిన గుడ్డలో ఇంగువ లేకున్నా వాసన వచ్చినట్లుగా లోలోపల ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పైకి మాత్రం ఎంతో గుంభనంగా ఉన్నవారిలా నటిస్తూ గత వైభవానికి వారసులుగా కనిపిస్తూ వుంటారు.అలాంటి వారి గురించి బాగా దగ్గరగా తెలిసిన వారు 'అయ్యో! పాపం వాళ్ళు' "ఇంగువ కట్టిన గుడ్డ లాంటి వాళ్ళు" అని జాతీయంతో పోల్చి జాలి పడుతూ బాధను వ్యక్తపరచడం చూస్తుంటాం.
మన వంటింట్లో వుండి మనం వండుకునే పప్పు కూరలు,పులిహోరల్లో చేరి తన ఘుమఘుమలాడే వాసనతో ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్ళు ఊరేలా చేసే ఇంగువ ఇంత గొప్ప జాతీయంగా, "రామఠ కరండ న్యాయము"గా పేరు తెచ్చుకోవడం ఇంగువ ప్రియులందరికీ ఆనందకరమైన విషయం కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి