వంటింటి ఔషదం .జిలకర్ర .; సేకరణ ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 పురాతనకాలం నుండి ఉపయోగించబడుతుంది. సిరియన్ లోని టెల్- ఎడ్- డర్ ప్రాంతంలో పురాతత్వ పరిశోధిత త్రవ్వకాలలో జిలకర్ర గింజలు లభించాయి. ఇవి క్రి.పూ 2000 సంవత్సరాల పూర్వంనాటివని భావిస్తున్నారు. ఇవి పలు పురాతనకాల ఈజిప్షియన్ కొత్తరాజ్యాలకు చెందినవని భావిస్తున్నారు.  పురాతన ఈజిప్ట్ నాగరికతలో జిలకర్ర మమ్మిఫికేషన్ క్రియలో సంరక్షణాకారి (ప్రిజర్వేటివ్) సుగంధద్రవ్యంగా ఉపయోగించబడిందని 
ఆరంభకాలంలో జిలకర్ర ఇరాన్, మధ్యధరా సముద్రం ప్రాంతాలలో పండుంచబడింది. జిలకర్ర బైబిల్ పాతనిబంధనలు, కొత్తనిబంధనలలో ప్రస్తావించబడింది. పురాతనకాల జిలకర్రను తమ భోజనమేజా మీద (ప్రస్తుత మిరియాల పొడిలా) ఉంచేవారు. ఈ అలవాటు మొరాకోలో కూడా పొడిగించబడింది. పురాతన రోమన్ వంటకాలలో విస్తారంగా ఉపయోగించబడింది. భారతదేశంలో జిలకర్రను వేయి సంవత్సరాల నుండి సంప్రదాయ వంటసామాగ్రిలో భాగం అయింది. భారతీయులు దీనిని కుర్మా, మసాలా, సూప్, పలు ఇతర వంటకాలలో ఇతర సుగంధద్రవ్యాలతో కలిపి ఉపయోగిస్తుంటారు.
జీలకర్ర : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ, ఔషధము గాను వాడుతారు . ప్రాచీన కాలము నుండి ఇది వాడుకలో ఉంది. హిందూ వివాహంలో త్రేతాయుగం నాటినుంచీ వధూవరులు పెళ్లి ముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టే ఆనవాయితీ ఉన్నదని రామాయణం ద్వారా తెలుస్తోంది. రామాయణంలో శ్రీరాముడు, సీతమ్మ వార్ల వివాహాన్ని వర్ణించేటప్ఫడు జీలకర్ర ప్రస్తావన వస్తుంది. నేటికీ భద్రాద్రి ఆలయంలో సీతారాముల కల్యాణంలో జీలకర్ర బెల్లం ఘట్టం ఉంటుంది. భారతీయులు విరివిగా ఆయుర్వేదిక, సాంస్కృతిక, ఆహార పదార్ధాల్లో దీని వినియోగ ప్రాశస్త్యం తెలియజేయడం వల్ల క్రమంగా క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి ముందు మధ్యపాశ్చ దేశాల వాళ్ళు దిగుమతి మొదలుపెట్టుకున్నారు. 
రోగాలపై జీలకర్ర:
కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.
మూత్ర సంబంధ వ్యాధులకు : జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.
పైత్యరోగాలకు : 
జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే ... తలతిప్పు, కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును . 
తేలుకుట్టుకు : 
జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును .
నీళ్ళవిరోచనాలు తగ్గుటకు : 
అరతులము జీలకర్ర ఇనుమూ గరిటెలో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి ... చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి . వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్రతో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచముగా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును
జీలకర్ర వంటలలో ఉపయోగించే ఒక విధమైన మసాలా దినుసులు.
 జీలకర్ర నల్ల మిరియాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ప్రసిద్ధిచెందిన మసాలా దినుసు. వీటికి గల మంచి వాసన కోసం నేపాల్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక మెక్సికో మొదలైన దేశాలలో విరివిగా వాడుకలో ఉంది. జీలకర్రను పొడిగా గానీ లేదా మొత్తం గింజలుగా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణ శక్తిని వృద్ధి చెస్తాయి.
జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం