నువ్వు మూటకట్టినదాన్ని ఇంకా విప్పనేలేదుగా! ఎవరికోసమని నవ్వుల్ని దాచిపెట్టావో ఆ మూటలోని నవ్వుల పూవుల్ని ఇంకా పంచిపెట్టనేలేదుగా! నవ్వుల మాలకట్టి తెచ్చినదాన్ని ఇంకా అందరికీ వేయనేలేదుగా! నిలువెల్లా నవ్వుల పులకరింతలు! తనువెల్లా నవ్వుల పలవరింతలు! వెండితెరవెన్నెల్లో, నీ నవ్వుల జడివానలో హాయయిన హాస్యపు నయాగరా మా సుందర అనుభూతి! వసంతంలా నువ్వొచ్చావని అనుకున్నాం కాని, అంతలోనే శిశిరం వచ్చేసిందా నీకు.
మా కలలలోకాన విహరిస్తున్న నీవు
అంతలోనే చీకటిగా మారావు. ఎవరి కనుదిష్టి నీపై పడిందో, ఎవరి చేతబడి నిన్ను నిర్వీర్యుడిని చేసిందో, భువిలో మమ్మల్ని దుఃఖంలో ముంచి ఇక దివిలోనివారిని నీ హాస్యపు ఝల్లుల్లో
తేల్చడానికి వెళ్ళిపోయావా నవ్వులరేడా?!!!
+++++++++++++++++++++++++
(ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కి స్మృత్యంజలి)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి