కొండ కోనలోని కోటి రకాల
పూవులెన్నో ??
వాటి సౌరభమెంతో??
గిరిని జారు జలపాతపు
హోరులోని సంగతేంటో???
సంగీతమేంటో?
నింగిలోని సాగు పాలమబ్బుల
గుంపు లోన నీరు ఎంతో??
నీటి వేగమెంతో?
చినుకు కురిసి తడిసిన
నేల పరవశమెంతో?
పరిమళమెంతో?
నిశిని కురిసిన నీహారికల
అందమెంతో??
ఆయువెంతో?
మమత నిండిన మనసున
అభిమానమెంతో?
ఆత్మీయత ఎంతో?
ప్రేమ నిండిన జగతిని
చూడగలిగే ఓర్పు ఎంతో?
సహనం ఎంతో?
వీచుగాలి మోసుకుని తెచ్చు
గీతనాదాలకు భావమెంతో?
బరువు ఎంతో??
ఆగి చూచి తిలకించి ఆలకించే
భావుకత్వం ఎంత ఆనందమో?
ఎంత అదృష్టమో?
రేపటికై ఎదురుచూచు
ఓపలేని మనసుకు
వేడుకలెన్నే....కానుకలెన్నో
తెచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి