మనోనీతి అంటే అర్థం ఏమిటి అంటే మనసులో వచ్చే ఊహలు భావాలు.మనసుకి ఇష్టం ఐనవి.కానీ హిందీ లో మనోనీత్ అంటే నియుక్తి నామినేటెడ్ అని అర్థం.
మధుకరీ అంటే పూర్వం గురుకులంలో విద్యార్థులకు సాధుసన్యాసులకు భిక్షగా అన్నం పప్పు రొట్టెలు వండినవి భిక్షగా ఇచ్చేవారు.గురుకుల విద్యార్థులు కేవలం ఐదు ఇళ్ళల్లో మాత్రమే భిక్ష తీసుకోవాలి.భిక్షాందేహిఅని వచ్చేవారికి ఆబ్రహ్మచారులకు తప్పక ఆఇంటివారు భిక్షవేసేవారు.తమకొడుకు కూడా అలాగే భిక్షాటన తో చదువుతున్నాడు కాబట్టి మధుకరీ మాధుకరీ వేసేవారు.మధుకరం అంటే తుమ్మెదలు పువ్వుకి ఎలాంటి హానీ జరగకుండా పూలరసాన్ని
తాగుతాయి.అలాగే ఏవ్యక్తికీ భారం కాకుండా భిక్ష ను స్వీకరించి విద్యాభ్యాసం చేసేవారు.అలా లభించిన ఆహారం తో కడుపు నింపుకుని చదువుకున్న వారు ఉచితంగా విద్యాదానం చేసేవారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి