కాలం మహిమే అది.. మాసిపోవడం!
జీవితాలన్నీ అరవిరిసిన కలువల్లా
ప్రభవిస్తూనే ఉంటాయి...
కాలం లోయలోకి జారిపోతున్నప్పుడు
వద్దనుకున్నా మాపు సహజ ప్రక్రియ!
మాసిపోయిన ప్రతిదానికి
ప్రక్షాళన అవసరం.
ప్రక్షాళన అంటే మరేమీ కాదు.
మలినరూపంలో ఉన్న
కల్మషాలన్నీ కడిగి కడిగి
ఉతి ఉతికి ఝాడించి ఆరెయడమే!
ఎవరికి వారే నేర్చుకోవాల్సిన
స్వీయ కృత్యం అది!
మాసిపోయిన మనుషుల్ని
అసహ్యించుకునే వారే తప్ప
ఆదరించి అక్కున చేర్చుకోరెవరూ!
డబ్బుంటే చాలు మాసిపోయిన
గబ్బు జీవితాలని అత్తరులతో
కప్పెయ్యడానికి... ముంచెత్తడానికి!
ఒక్కటి మాత్రం నగ్న సత్యం!
మాసిపోయిన జీవితం
అనుభవాల అగ్నిగుండం!
ప్రక్షాళన చేసుకున్న అనంతరం
మెరుగు పెట్టిన కోహినూర్ వజ్రం!
-------- : -------
జీవితాలన్నీ అరవిరిసిన కలువల్లా
ప్రభవిస్తూనే ఉంటాయి...
కాలం లోయలోకి జారిపోతున్నప్పుడు
వద్దనుకున్నా మాపు సహజ ప్రక్రియ!
మాసిపోయిన ప్రతిదానికి
ప్రక్షాళన అవసరం.
ప్రక్షాళన అంటే మరేమీ కాదు.
మలినరూపంలో ఉన్న
కల్మషాలన్నీ కడిగి కడిగి
ఉతి ఉతికి ఝాడించి ఆరెయడమే!
ఎవరికి వారే నేర్చుకోవాల్సిన
స్వీయ కృత్యం అది!
మాసిపోయిన మనుషుల్ని
అసహ్యించుకునే వారే తప్ప
ఆదరించి అక్కున చేర్చుకోరెవరూ!
డబ్బుంటే చాలు మాసిపోయిన
గబ్బు జీవితాలని అత్తరులతో
కప్పెయ్యడానికి... ముంచెత్తడానికి!
ఒక్కటి మాత్రం నగ్న సత్యం!
మాసిపోయిన జీవితం
అనుభవాల అగ్నిగుండం!
ప్రక్షాళన చేసుకున్న అనంతరం
మెరుగు పెట్టిన కోహినూర్ వజ్రం!
-------- : -------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి