న్యాయాలు -217
రాజ సేవా న్యాయము
*****
రాజు అంటే ప్రభువు, పుడమి ఱేడు ,రాచవాడు,యక్షుడు, ఇంద్రుడు,చంద్రుడు అనే అర్థాలు ఉన్నాయని మనకు తెలుసు.
అలాగే సేవా అంటే శుశ్రూష, కొలువు,అనుసరణ,పూజ, చెప్పిన పని చేయుచుండుట, గౌరవించడం, భక్తి,వాడుక,తఱచఉ వచ్చుచుండుట, స్తోత్రము,బుజ్జగించుట లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
రాజును సేవించువాడు అంటే రాజుకు సేవ చేసే వ్యక్తి కేవలం రాజుకొక్కనికే కాదు రాజుకు రాజ కుటుంబానికి,ఆయన దగ్గర ఉండే మంత్రికి, సలహాదారుకు,ఆయన ఆశ్రిత బంధు వర్గాలకూ... ఇంతెందుకూ రాజు గారి ఇంటి లోని పిల్లికి కూడా భయపడుతూ ఉండాల్సి వస్తుందనే అర్థంతో ఈ "రాజ సేవా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలాంటి సేవా వృత్తిని చేపట్టిన వ్యక్తి బతుకు తెరువు కోసం వెళ్ళినప్పుడు ఇలా ఉద్యోగముతో పాటు ఊడిగమూ చేయాల్సి వుంటుంది.అలా కాని పక్షంలో వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది.దాంతో చేస్తున్న ఉద్యోగము పోయి బతుకు తెరువు కష్టమవుతుంది.ఉన్న ఆధారం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితీ ఏర్పడుతుంది.
అందుకే సేవకా వృత్తిలో ఉన్న వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందనే విషయం చెబుతూనే,ఆశ్రితునకు ఇలాంటి విషయాల్లో సహనము ,సరైన నడత ఉంటేనే రాజు లేదా యజమాని అనుగ్రహాన్ని పొందుతాడనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
ఇలాంటివి ఎక్కువగా ప్రభుత్వేతర సంస్థలలో కనిపిస్తూ వుంటాయి.అక్కడ చేసే కొన్ని ఉద్యోగాలు ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ ,ఎలాంటివి జరిగినా స్పందన లేకుండా,తమ కంటూ స్వంత నిర్ణయాల జోలికి పోకుండా,వారికి అనుకూలంగా ఉంటేనే తాము చేసే ఉద్యోగం నిలుస్తుంది. లేదా ఏదో ఒక నెపంతో బయటికి పంపించబడతారు.
అందుకే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాలలో ఒకడై ఉండి కూడా ధూర్జటి లాంటి మహా కవి"రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయము" అన్నాడు.
అందుకే తెలుగులో "రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా" అనే తెలుగు సామెత కూడా ఈ న్యాయమునకు దగ్గరగా ఉంటుంది. రాజు దగ్గర ఊడిగం చేసే వ్యక్తి ఒకోసారి రాజు చేతిలో అకారణంగా దెబ్బలు కూడా తినాల్సి వస్తుందన్న మాట.
ఇది ఇప్పటి విషయం కాదు మహా భారతంలోని విరాట పర్వములో పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. రాజులను సేవించేటప్పడు ప్రవర్తించవలసిన పద్ధతులను, నియమాలను ధౌమ్యుడు అనే మహర్షి పాండవులకు ఇలా చెబుతాడు.
"రాజు కన్నా విలువైన దుస్తులు ధరించడం కానీ, అతిగా మాట్లాడటం కానీ చేయకూడదు.అలాగే అభిమానిస్తే పొంగిపోవడం, అవమానిస్తే కుంగి పోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ ,వాన, ఆకలి,దప్పిక, కాలము, ప్రదేశముతో నిమిత్తము లేకుండా చేయాలి.రాజ ధనాన్ని విషంతో సమానంగా చూడాలి."
బతకాలంటే ఉద్యోగము చేయాలి.ఇలా రాజుల్లాంటి వ్యక్తుల దగ్గర చేయాలంటే పై విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటారు.
ఇదండీ "రాజ సేవా న్యాయము" యొక్క వివరాలు, విశేషాలు. అలాంటి ఉద్యోగము చేయాలనుకుంటే వీటిని గమనంలో ఉంచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి