జలదాలు కురిపించు
జడివాన ధారలు
బంగారు జలతారు
పరదాల తీరు....
పుత్తడి వెలుగులు
కలిసిన చినుకులు
అక్షింతలై కురవగా
సిగ్గులమొగ్గైన పుడమి
తనువుపై పులకలు
మొలవగా ముచ్చటగా
మొత్తం తడిసి చిత్తైపోయి
కొత్తమెరుపు సంతరించుకుంది
కురిసేటి ధారల మధ్యన
మెరిసేటి గిరుల ఆద్దాన
విరిసేటి అందాలు చూచి
మురిసేను నింగిని మబ్బులు
వెలుగులతో కూడిన వాన
కిరణాల సయ్యాటలాడు
తరుణాన తడిసేటి
ధరణిని ఉయ్యాలలూపె!
మురిపించు అందాల ప్రకృతి
తరియించె తపముడి కృపతో
మైమరపించు అందాల వెలిగి
కనులకు విందునే చేసే!
కరుణల జల్లు వర్షించు వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి