గొడ్డుతో సమంగా గొడ్డులా...నాగలి కాడుకు ఎద్దుతో ఎద్దునై .... !వ్యవసాయం చేస్తున్న...బడుగు రైతును నేను.. !అష్ట కష్టాలు పడుతున్నాపొలం విడిచి పెట్టలేని..వేరొకపని చేతగానికర్షకులము మేము.... !!!కూడు మాకు కరువైనా....జనం కడుపులు నింపుకొరకు అహర్నిశలు శ్రమించే... మముఅన్నదాతలమని పొగిడేరు !మీ పొగడ్తలు, మెచ్చుకోళ్ళు మాకెందుకు నాయనా... !మా బ్రతుకులు బాగుపడే దారిచూపితే.... అదేచాలు !!మాకు వెన్ను దన్నుగా మీరు నిలబడితే చాలు... !. మేము, మట్టినుండి గొప్ప -గొప్ప పంటలు పండించుతాము !అందరికీ బలమైన ఆహారం అందించుతాము !!; ********
అన్నదాత..;.. కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి