ఇంతకుముందు రెండు రచనలు గురించి మాట్లాడు కున్నాం అవి రెండూ కూడా సంస్కృత నాటకాలే. ఇది కూడా సంస్కృత నాటకమే దీని పేరు ఉత్తర రామాయణ చరిత్రము చాలా గొప్పగా ఇతివృత్తాన్ని మలుచుకుని చిత్రీకరించిన విధానం
అధ్బుతమైన రీతిలో ముందుకు సాగింది. కరుణ రసాత్మకంగా ఉత్తర రామ చరిత్ర సంస్కృత నాటకాన్ని సృజించారు. సీత మరణంతో దుఃఖాంతమైన వాల్మీకి రామాయణాన్ని తన నాటకంలో సీతారాముల కలపడం ద్వారా సుఖాంతం చేశారు. ఈ ఒక్క నాటకం రచనా కౌశల
ప్రతిభతోని భవభూతి సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు సరసన నిలబెట్ట దగిన వాడయ్యాడు. భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్ జర్మనీ ఫ్రెంచ్ యూరోపియన్ భాషలలో కూడా అనువదించబడిన ఘనత పొందిన సంస్క్రుత
నాటకం ఉత్తర రామ చరిత.
ఈయన నాటికలలో కౌటిల్యుని ఆర్థ శాస్త్ర లక్షణాలు చాలా చక్కగా బాగా మనకు
కనిపిస్తాయని అంటారు.
ఇంకా ఉంది 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి