మేం కళాశాలలో చదువుతున్నప్పుడే కాకాని వెంకటరత్నం గారు భారత్ సేవక్ సమాజ్ అన్న సంస్థను ప్రారంభించి అనేక ఉన్నత ఉత్తమ ఆశయాలతో ముందుకు తీసుకువెళ్లారు సుబ్బారెడ్డి గారి అబ్బాయిగా నేను సీతారామయ్యగారి అబ్బాయిగా భాస్కర్ రావును గన్నవరంలో ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ముసునూరు రత్నబోసును ఎక్కువగా ప్రేమించేవారు.
దాదాపు 200 మంది విద్యార్థులు రావడానికి ఇష్టపడితే దానిలో 90 మందిని ఎన్నిక చేసి ఫలానా రోజున ఫలానా రైల్లో మనం బయలుదేరాలి అని అందరికీ తెలియజేసి వంట మనిషిని ఏర్పాటు చేసుకుని అతనికి కావలసిన సహాయకారులను తానే తెచ్చుకునే ఏర్పాటు చేసి అనుకున్న సమయానికి విశాఖపట్నం వెళ్లాం ముందే మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాకు ఏర్పాట్లు చేసిన గదులను స్వాధీనం చేసుకుని ఎవరి గది లో వారు ఉండేట్లుగా ఏర్పాటు చేశారు ఉదయం అల్పాహారం చేసి బయలుదేరడం మొదట విశాఖపట్నంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి అక్కడ ప్రకృతిని ఆస్వాదించాం. పిల్లలు స్నానానికి బయలుదేరితే వారి బాధ్యత అంతా మేమే తీసుకుని ఎంతో జాగ్రత్తగా ముగించి భోజన సమయానికి వచ్చేసాం.
ఆ పరిసర ప్రాంతాలలో ఏ ఏ ప్రాంతాలను చూడాలో ముందే నిర్ణయించుకుని ఆరోజు కార్యక్రమాన్ని ఆ రోజున పూర్తి చేసేవాళ్లం రాత్రి విశ్వవిద్యాలయానికి వచ్చిన తర్వాత పిల్లలతో కూర్చొని వారి అనుభవాలను అన్నిటినీ వింటూ కాలక్షేపం చేసే వాళ్ళం అక్కడ ఉద్యోగస్తులు కూడా మాకు ఎంతో సహకరించారు సమయానికి భోజనం ఉపాహారం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి