పాపాయి ప్రశ్నలు;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,-9966414580.
నీటిలోని చేపలు
ఈదుతాయి ఎందుకు?
ఏటిలోని జలములు
పరుగుతీయునెందుకు?

తరువులోని ఆకులు
రాలుతాయి ఎందుకు?
తోటలోని పూవులు
వాడుతాయి ఎందుకు?

నింగిలోని చుక్కలు
వెలుగుతాయి ఎందుకు?
కొలనులోని కలువలు
సొగసులీనునెందుకు?

గాలిలోన పక్షులు
ఎగురుతాయి ఎందుకు?
కడలిలోని తరగలు
ఎగసిపడును ఎందుకు?

పుడమిపైన మొక్కలు
పెరుగుతాయి ఎందుకు?
పొలంలోన పంటలు
పండుతాయి ఎందుకు?

గాయపడిన మనసులు
విరుగుతాయి ఎందుకు?
కష్టపడిన బ్రతుకులు
ఎదుగుతాయి ఎందుకు?


కామెంట్‌లు