బాల గేయం ; - కోరాడ నరసింహా రావు !
ఇంటింటి చెత్తా..... 
   బళ్ళు - బళ్ళుగా చెత్త.... 
     ఊరు - వాడల చెత్త.... 
.      పేరుకుపోతోంది... !

మనుషుల చెత్తంతా 
  మట్టిలో -నీళ్లలో.... 
    మలినమై మారుతూ 
   కాలుష్య రక్కసిగ... 
  మారిపోతోంది !

పర్యావరణమును 
  పాడుచేసేస్తూ... 
    ప్రకృతి సమతుల్యతను 
     దెబ్బతీసేస్తోంది... !

వైరస్లు సృష్టించి 
  రోగాలు పుట్టించి 
  మనిషి ప్రాణాలతో చెత్త 
    ఆడుకుంటోంది... !

ఐనా..  తెలివైన మనుషులు 
  ఈ చెత్తనంతా...
    ఒకచోట చేర్చి... 
     ప్లాంట్లకు, రోడ్లకు.. 
     వినియోగించుచు... 
     అపకారి చెత్తను 
       మనకు ఉపకారిగా... 
         మార్చుతున్నారు !!
       ***************


కామెంట్‌లు