73)
సోమరి తనమే ద్రోహమై, కన్నవార్కి కలతనిడు
సంఘం చెక్కిన శిల్పమై, చేతనుండ మెరుపునిడు!
74)
తెగినా గూటిని వెంటనే, సాలెపురుగు అల్లుగద
పట్టును దోచుకు పొయినా, తేనెటీగ నింపుగ ద!
75)
ఉదయపు వేళల కిరణమై, శ్రామికతను సాధించు
హృదయపు స్పందన సంపదే, కఠినరీతి శ్రమియించు!
76)
పిట్టకు చదువు రాకున్నా, కాలమహిమ చూడుమిల!
బ్రతుకగ వలసలు బో యినా, తిండిగూడు సాగునిల!
77)
చెప్పిన మాటకు విలువగా,ఆచరణలె ఉండవలె!
ఒప్పగు పనులే చేయుచూ, ఒదిగిఎదుగు తుండవలె!
78)
నల్లని మేఘము ముసుగులో, గిరుల కన్పెలే నిలచె
పయ్యెద జారిన తీరయీ,తరుల చీరగా మలచె!!
79)
తలపుల దాహమె తీరదే, తన్మయించునే హృదియె
వలపుల లోనిది సహజమే, అనునయించులే మదియె!
80)
దేశం చుట్టిన వీరులే,బొడ్రాయినిక చూడరిట!
గ్రామం శివారు లోపలే, తెలివిమరిచి పోదురిట!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి