ఆధ్యాత్మిక రంగంలో సులభ మార్గంలో ఫలితాన్ని అనుభవించాలని అనుకోవడం స్వార్థం. స్వప్రయోజనం, కుయుక్తులతో పుణ్యాన్ని సంపాదించాలని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. కలియుగంలో పుణ్యం పొందే మార్గం దానధర్మాలు అని సాశ్త్రవాక్యం. అయితే కఠినమైన నియమాలతో తపస్సు ఆచరించడం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పనికాదు. యజ్ఞాలు నిర్వహించడమూ కష్టసాధ్యమే! ధర్మమార్గంలో పయనిస్తూ దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. పుణ్యం కోసం దానాలు చేయడం స్వార్థం అవుతుంది. నిస్వార్థంగా దానం చేయడం ఉత్తమ లక్షణం అన్న విషయాన్ని సాధకులు చక్కగా అవగతం చేసుకోవాలి.గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి. ఎందుకంటే మనిషి చేసే కర్మల ఆధారంగా మరణానంతరం స్వర్గమో నరకమో పొందుతాడు. ఒక వ్యక్తి చేసే అనేక పుణ్య కార్యాలలో దానం ఒకటి. పేదలకు, నిరుపేదలకు దానధర్మాలు చేయాలని, వారి పట్ల దయ చూపాలని సదరు పురాణం చెబుతోంది.ఎవరికైనా ఏదైనా దానం చేయాలనుకుంటే..స్వయంగా వెళ్లి ఇవ్వడం మంచిది. ఇంటికి పిలిపించుకుని ఇస్తే దానధర్మాల పూర్తి ఫలితం దక్కదు.ఏదైనా మంచి కార్యాలకు ఈ డబ్బు ఖర్చు చేయాలి. మరోవైపు దానధర్మాలు చేసేటప్పుడు ఆనందంతో, స్వచ్ఛమైన మనస్సుతో చేయాలి. స్వచ్ఛమైన మనస్సుతో చేసే దానం వల్ల ఆ వ్యక్తి భాగ్యం వికసిస్తుంది. మరోవైపు నువ్వులు, నీరు, బియ్యం దానం చేసే వస్తువులు. పితృలకు నవ్వులు, దేవతలకు బియ్యం దానం చేయడం మంచిది.
బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు అని పెద్దలు చెబుతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి