కృష్ణ చరిత్ర గ్రంథకర్త -మాతృభాషను ప్రేమించాలి అనేదే ఆయన నినాదం!; - అచ్యుతుని రాజ్యశ్రీ
 మనభాషలో మాట్లాడాలి అంటే సిగ్గు ఎందుకు?మన మాతృభాష ప్రగతికి రాచబాట అన్న ఆయన సంస్కృతం బెంగాలీ ఆంగ్లంలో ఉద్దండ పండితులు.అంతేకాదు ఆంగ్లేయుల పాలనలో 20ఏళ్లవయసులో డిప్యూటీ కలెక్టర్ ఐనారు.నెలపొడుపు చంద్రునిగా ఎదిగి న్యాయ శాస్త్రం లో పట్టాపొంది 32ఏళ్లుఉద్యోగంచేసి 1891లో రిటైరైనారు.5ఏళ్ల పాపతో 11 ఏళ్ల ఆయనకి పెళ్లి ఐంది.22వ ఏట ఆమె చనిపోటంతో రాజ్యలక్ష్మీ దేవితో పెళ్లి ముగ్గురు కుమార్తెలతో ఆయన జీవితం సాఫీగా సాగిపోయింది.
రోజు అమ్మ నాన్నలకు పాదాభివందనం చేసి తన పని ప్రారంభించేవారు.53వ ఏట తనకు పుస్తకాలు రాసుకోవాలి అనే కోరిక ఉంది అని పదవీవిరమణ చేసిన ఆయన 56ఏళ్ళకే పరమపదించారు.నెలకు 400రూపాయల పెన్షన్."  నా మందు ఇదే" అని డాక్టర్ కి భగవద్గీత చూపిన నిష్కామ కర్మ యోగి! రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని కలిశారు.ఆయన 15నవలలు రాశారు.కొన్ని సినిమాలు గా వచ్చాయి.పాత్రికేయునిగా రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ ఆప్యాయత పొందిన భాగ్యశాలి.
ఆయన పేరు కి "వంగినది-నెలపొడుపు చంద్రుడు" అని అర్ధాలు.
ఆయన చిరంజీవి 🌷
ఆయన బంకించంద్ర ఛటర్జీ.తండ్రి యాదవచంద్ర కూడా డిప్యూటీ కలెక్టర్.తల్లి స్నేహమయి.వందేమాతరంతో ఆయన సదా చిరంజీవి 🌷

కామెంట్‌లు