ప్రోత్సాహక బహుమతులు


సర్వేజనా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జూలై మాసంలో నిర్వహించిన "ఆదర్శ వ్యక్తులు" వ్యాసరచన పోటీలో తెలంగాణ ఆదర్శ పాఠశాల -బచ్చన్నపేట,జనగామ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న ఎం.అరుణ్,డి.నిహారిక,జి.సమీర ప్రోత్సాహక బహుమతులుగా గాజుల సత్యనారాయణ గారు రచించిన పెద్దబాలశిక్ష పుస్తకాలను అందుకోవడం జరిగింది.ఈరోజు ప్రార్థనా సమావేశంలో ప్రిన్సిపల్ కె.కృష్ణవేణి గారు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అందించడం జరిగింది.సర్వేజనా ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ప్రతి నెల ఒక అంశం మీద పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విషయం.
విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గౌరవ శ్రీ కింతలి సన్యాసిరావు గారికి మా విద్యార్థుల తరుపున,ఉపాధ్యాయుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు.
కామెంట్‌లు