జాతీయ సాహితీ పురస్కారానికి ఈశ్వరరావు ఎంపిక.


 రాజాం రచయితల వేదిక సభ్యులు, తలతంపర గ్రామవాసి పోలాకి ఈశ్వరరావు జాతీయ స్థాయి సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కరీంనగర్ కు చెందిన ఆర్యాణి సకల కళా వేదిక, గౌతమేశ్వర సాహితీ కళా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ రికార్డు కవితా పోటీలలో పాల్గొని, ఈశ్వరరావు తన ప్రతిభను చాటుకున్నారు.  
సాహితీ చరిత్రలో ఒక నూతన ప్రక్రియగా ఒక్కగంటలో 2 కవితల పోటీలో పాల్గొన్న ఈశ్వరరావు పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. 
అంతర్జాల వేదిక ద్వారా 
రెండు కవితలు వ్రాయాలంటూ ఇచ్చిన రెండు వేర్వేరు అంశాలకు సంబంధించి, రెండు కవితలనూ కేవలం 45 నిమిషాల్లో పూర్తిచేసిన ఈశ్వరరావు జాతీయ స్థాయి సాహితీ రికార్డుకు ఎంపికయ్యారు. కరీంనగర్ ఫిల్మ్ భవన్ వేదికపై ఈనెల పదో తేదీన ఈశ్వరరావుకు పురస్కారప్రదానం గావించనున్నట్లు సంస్థ అధ్యక్షులు దూడపాక శ్రీధర్, 
సమీక్షకులు వేణుగోపాలరావులు ఆహ్వానం పంపారు. జాతీయ స్థాయి సాహితీ పురస్కారానికి ఈశ్వరరావు ఎంపిక కావటం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు