సెల్ ఫోన్ వలన అనర్ధాలు;-సి.హెచ్.ప్రతాప్
 సమాజంలో సెల్ ఫోన్ అతిగా వాడడం మొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది మనో వైజ్ఞానికులు, సాశ్త్రవేత్తలు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా అంతకంతకూ సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది.
మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.ఇవి భవిష్యత్తులో మన ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపించే ప్రమాదం వుందన్న హెచ్చరికలు మనం పెడ చెవిన పెట్టకూడదు. అంతేకాక స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం వుంది.
శరీర ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం కూడా ఎక్కువే.ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే, క్యాన్సర్‌ కావాలని కొనుకున్నట్టే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
అతిగా సెల్ ఫోన్ యూజ్ చేయడం వలన, చేతికి బాధారకమైన స్థితి రావచ్చు, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడానికి ప్రధాన కారణం, దాని నుండి వచ్చే రేడియో ధార్మికత…
పిల్లలపై, తల్లులపై, తండ్రులపై, అత్త, మామలపై ఇలా ఏ బంధం చూసినా ఒంటరిగా మారడానికి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా మారుతుంది.
తగు సమయంలో దీనిని గురించి ఆలోచన లేకుండా, అదే పనిగా సెల్ ఫోన్ వాడితే, మనిషిలో యాంత్రికత పెరిగి, మానవ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా వున్నాయి. 
సి.హెచ్.సాయిప్రతాప్ 
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా)
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 

కామెంట్‌లు