సుప్రభాత కవిత -బృంద
చినుకు కురిసి తడిసిన నేల
వరుణుడు ప్రేమతో రాసిన లేఖ

అణువు అణువు కురిసిన
పరిమళించే ప్రణయమధువు 

మమతల జడిలో మునిగిన
అవని మొత్తం నూతన వధువు

కరిమబ్బులు నిండిన అంబరం
వేడుకైన వానకు నేల సంబరం

ఎంత మబ్బు ముసిరినా
ఎంత వాన కురిసినా

సూర్యోదయం రాక మానదు
నవ్యోత్సాహం నింపక ఆగదు

కనురెప్పల పందిరిలో పూచిన
పూలనవ్వుల మెరుపులాగవు

ఇలకు కానుకగా ఇనుడి కిరణాలు
కాంతిరేఖలు నింపక తప్పదు

పరుగులు పెడుతున్న కాలానికి
చీకటివెలుగులతో పనిలేదు

కష్ట సుఖాలను ఒకే తీరుగ
చూసే సహనం  మనకవసరం

తృటిలో మారే జీవితాలకు
తృప్తే చక్కని జీవనసూత్రం

కానున్నది కాక మానదు
రేపన్నది ఎపుడూ ఉన్నదంటూ

వచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు