జీవన సార్ధకత.;- డా. పివిఎల్ సుబ్బారావు, 94410 58797
 
124.
శిల్పం కన్ను చూపు చూపా! 
జున్ను గడ్డి జున్ను తీపి తీపా! 
మనసులేని మనువు మనువా! 
తలపు లేని తనువు తనువా! 
పిలుపు వినని మనిషి మనిషా!
125.
మానవత్వం విధివశం!
 
కాలాన కరోనా ఆధిపత్యం! 
పోరాటాన మనిషి విజయం! 
మానవత్వం గెలిచి నిలిచింది! 
జగాన ఆనందం వెళ్లి విరిసింది!
126.
మానవత్వం సూర్యుడు! 
సంపూర్ణ గ్రహణంలో చిక్కాడు! 
పట్టిన గ్రహణం వీడక మానదు! 
 వెలుగులరేడు ,
                విడుదలవుతాడు!
 విశ్వమంతా వెలుగులు,  
                 విరజిమ్ముతాడు!
_________
రేపు కొనసాగుతుంది.
.

కామెంట్‌లు