సంయమనం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు  పాములు చూస్తే భయపడని వారు ఉండరు  పాములలో రకరకాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలిసిన  ఏ పాము కరవడం వల్ల  ప్రాణం పోతుందో తెలిసిన వారు తక్కువ  త్రాచుపాముల్లో విషం ఎక్కువగా ఉంటుందని వింటాం  కనుక దానిని చూస్తే మరీ భయపడతాం  కానీ దానిని పట్టి ఆటలాడించి  దానివల్ల  డబ్బులు సంపాదించుకునే వారు కొంతమంది ఉన్నారు  ఆ పామును ఎలా పట్టుకోవాలో అది కరవకుండా ఉండడానికి  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  అన్ని అతనికి కూలంకషంగా తెలుసు  కనుక ఆ సాహసం చేయడానికి అతను ముందుకు వస్తాడు  దానిని పట్టిన తర్వాత  అతని చేతిలో కీలుబొమ్మైపోతుంది అంత విషం ఉన్న సర్పరాజు పాము కూడా. ఎవరి స్నేహితులు ఎలాంటి వారో సమయం సందర్భం వస్తే కానీ తెలియదు  వారు ఎందుకు తనతో స్నేహం చేస్తున్నారో దాని వెనుక అతని  ఆలోచనల ఏమిటో అతను ఊహించలేదు  వారు మంచి వారు గనక అయితే  వారితో స్నేహం సజావుగా జరిగిపోతోంది  ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై చక్కటి ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తారు  అదే కుతంత్రంతో వచ్చిన వ్యక్తి  మంచి వాడిని ఎలా చెడగొట్టాలో  పద్ధతి ప్రకారం అతనిని  ఆ ఊబిలోకి దించి  జీవితంలో మరి లేవడానికి అవకాశం  లేనంత కీడు చేస్తాడు  అందుకే మన వాళ్ళు చెప్తారు  ఒక మంచి స్నేహితుని వంద రూపాయలు ఇచ్చి అయినా కొనుక్కో  అదే చెడ్డవాడు నీ స్నేహానికి వస్తే ₹1000 అయినా అతనిని వదిలించుకో  అని  అందుకే పెద్దలు అంటారు.
రాజుగారి కొలువు చేయడం  అసిధారావ్రతం లాంటిది  కత్తికి రెండు ప్రక్కల పదును ఉండడం వల్ల ఏ పద్ధతిలో దానిని ఉపయోగించినా అది చంపడానికే  పనికి వస్తుంది  రాజుగారు  తన దగ్గర పనిచేసే ఎవరినైనా అనుమానించినప్పుడు  అతనికి శిక్ష వేయాలి అనుకుంటే  అతనితో చాలా చనువుగా ఉంటాడు  తన వ్యక్తిగత పనులను కూడా అతనితో చేయించుకోవడానికి కుతూహలం చూపుతాడు  అలా రాజుగారికి సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి మనస్తత్వం  ఒకరోజు కాకపోతే మరొక రోజునైనా బయటపడక తప్పదు  చెడ్డ వారిని గుర్తించడానికి రాజులు పన్నే పన్నాగం అది  వేమన అలాంటి రాజులమనస్తత్వాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు కనక  ఆ రహస్యాన్ని మనకు చెప్పాడు ఆ పద్యాన్ని చదవండి.

"పట్టు నేర్పు పాము పడగ  యోరగ జేయు చెరుప చూచు వాడు చెలిమి జేయు  చంపదలచు రాజు చనువిచ్చుచుండు రా..."

కామెంట్‌లు