మల్లెపూలు;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెపూలు తెలుపు తెలుపు
కృషి చేస్తే గెలుపు గెలుపు
చేయి చేయి కలుపు కలుపు
జీవితమిక మలుపు మలుపు

మల్లెపూల వనంలోన
మమతలున్న మనసులోన
ఆనందం జాలువారు
శుద్ధమైన తలపులోన

మల్లె లీను పరిమళాలు
పల్లెలీను సోయగాలు
సత్సాంగత్యం మంచిది
దిద్దుతాయి జీవితాలు

మల్లె లంటే మగువలకు
అల్లరంటే పిల్లలకు
చాలా చాలా ఇష్టము
చేనులంటే రైతులకు

మల్లెపూలు బహు శ్రేష్టము
వాటి మేను కడు అందము
అవి మెడలోన,జడలోన 
ముడివేయును ప్రియ బంధము

మల్లెలు మల్లెలు మల్లెలు
మనసులు దోచే పూవులు
తెల్లదనం ఘనం ఘనం
వాటి మేలు కోకొల్లలు

కామెంట్‌లు