సుప్రభాత కవిత -బృంద
నిదురించిన  పొలం పై నింగి
కురిపించిన హిమబిందువులు
కనిపించని  కిరణాల  రాకకై 
కరిగిపోక నిలిచి చూచు వేళ

మేఘాల చాటున దోబూచులాడే
వెలుగురేఖల కాంతులు
తమలో దాచుకుని 
తనువంత హరివిల్లు రంగులీన

రాబోవు స్వామికి భక్తిగా
పాదాలు కడుగగా వేచి
నీహారికల  తలపైన మోస్తున్న 
చిన్ని పత్రాల శ్రేణి

ప్రాగ్దిశన పసిడి కాంతులు
నింపుతూ ప్రభవించు
ప్రభాకరుని ప్రభను గాంచి
పాదముద్రలకై వేచె ప్రకృతి కాంత

పంటపొలాన పచ్చదనమంత
తెలివెలుగులోన తడిసిపోయి
సంతరించుకున్న మెరుపులు
సవరించుకుంటూ స్వాగతమంటూ

పరవశించి పాడుతున్న

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం