సుప్రభాత కవిత ; - బృంద
అడుగంటనివ్వని 
ఆనందాలను....పంచి
ఆకాంక్షించే ఆరాటాలను
అనుగ్రహంగా  తెచ్చే....

వేదనైనా  వేడుకైనా
వాడుకగా వరమిచ్చి
వెతలన్నీ మరిపించి
వెలుగులతో నింపేసే.....

మదిగదిలో మమతలన్నీ
మరపురాని భావనలుగా
మధురాక్షరాలతో లిఖించి
మనసును మైమరపించేసే....

కదిలించని కలతల
కనిపించని తుట్టెను
కనికరించి  కమ్మగా
కనుమరుగు చేసే....

ఆకారం లేని ఆశలకు
అందమైన రూపమిచ్చి
అనుక్షణం అలరించి
అనుగ్రహం  కురిపించే....

కొంగుజాపి కోరినవన్నీ
కొదవలేక ప్రసాదించి
కలలు కన్న కన్నులకు
కమ్మని వరమిచ్చే.....

రేపు ఇచ్చే తీపి చెమ్మకై
కాపుకాసిన కమ్మటి వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు