మాతృభాషకు పొంచి ఉన్న ప్రమాదం!!- ప్రతాప్ కౌటిళ్యా

 ఏ భాష అయినా తీయనైనది. ప్రతి భాషా మూలాలు ప్రత్యేకమైనవి. అందులో భాగంగానే మన తెలంగాణ భాష ఒక ప్రత్యేకతను కలిగి మధురమైన అనుభూతిని భాషా స్వేచ్ఛను బాష పట్ల అధికారాన్ని ఇస్తున్నది తెలంగాణ మాండలికం. తెలంగాణ భాష జీవ భాష. మాండలికం లేకుండా తెలంగాణ భాష పరిపూర్ణము కాదు. భాషకు మాండలికము ఎంతో ఆరోగ్యకరమైన దీ. అద్భుతమైనది కూడా. భాషా శాస్త్రవేత్తలకు అంతు పట్టని విషయం ఏమిటంటే భాషా శాస్త్రాన్ని కూడా అంతుచిక్కకుండా భాషను చిక్కగా చేస్తున్న అంశము మాండలికము. ముఖ్యంగా తెలంగాణ మాండలికము ఒక అపురూపమైన అనుభూతి అధికారాన్ని కలిగిస్తుంది. అందరినీ ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని అమ్మలాగా కడుపునిండా తిండి పెట్టిన ఒక తీయని స్నేహాన్ని దగ్గరితనాన్ని ఇస్తుంది తెలంగాణ మాండలీకం. మండలికము లేకుండా తెలంగాణ భాషను ఆవిష్కరించలేము.
కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడుతుంది. అమ్మ నేర్పిన తెలంగాణ భాష ఇక్కడ విడిపోతుంది. ఒక విద్యార్థిగా పాఠశాలలో చదువుకోవడం ప్రారంభించినప్పుడు తెలంగాణ భాష మాండలీకము మాయమవుతుంది. ఎందుకంటే పాఠ్యపుస్తక భాష వేరు ఉపాధ్యాయుని ఉచ్చారణ భాషయాస వేరవుతుంది. మరొక సమస్య ఏమిటంటే పత్రికా భాష తెలంగాణ మాండలికము యాసల నుంచి పూర్తిగా వేరు చేయబడుతుంది. అంతర్జాలము మరియు చరవాణి టీవీ మొదలగు మాధ్యమాల భాష వ్యవహారిక భాషా వేరవుతుంది. అందువల్ల తెలంగాణ మాండలీకము యాసనూ పుట్టుకతో నేర్చుకున్న విద్యార్థి సమాజంలో నిత్యజీవితంలో జీవనశైలిలో భాగంగా మారినప్పటికీ ఒక విద్యార్థి పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి నెట్టు వేయబడుతున్నాడు. ఒక తెలుగు భాషలోనే ఇంత వైరుధ్యం వచ్చేసరికి విద్యార్థి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. భాషను నేర్చుకునే నైపుణ్యాలను బాష పట్ల అధికారాన్ని కోల్పోతున్నాడు నిజానికి ఒక తెలుగు భాషలోనే నువ్వు ఈ విధంగా మాండలికము యాస ఒక ఉచ్చారణ మొదలగు అంశాలలో వైరుధ్యము ఒక్కసారిగా వచ్చి పడేసరికి విద్యార్థి పూర్తిగా భాష స్వేచ్ఛను బాసపట్ల అధికారాన్ని కోల్పోతున్నాడు. ఎలా అంటే నిత్యం అమ్మానాన్న సమాజం మాట్లాడే భాష తెలంగాణ మాండలికమైనప్పుడు పత్రికా భాషా వ్యవహారిక భాష పాఠ్యాంశాల గ్రాంథిక భాష వేరైనప్పుడు ఏ విద్యార్థి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంతో తెలుగు భాషను నేర్చుకోలేడు. అంటే తెలంగాణ మాండలిక యాసాభాషనే కాదు. అసలు తెలుగు భాష నే ప్రామాణికంగా శాస్త్రీయంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో నేర్చుకోలేడు. అందువల్ల మాతృభాషలో కూడా వైకల్యం ఏర్పడుతుందని మనం గమనిస్తే చాలు. కేవలం మన తెలుగు భాష కే ఈ ప్రమాదం వచ్చింది అంటే అన్ని భాషలకు కూడా భాష యాస వల్ల మాతృభాషలకు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటే చాలు.
ముఖ్యంగా బాల్యంలో మన మండలికము యాసలో భాషను నేర్చుకుంటాం అందులో భాగంగా సమాజంలో చలామణి అవుతాం. కానీ పాఠశాల భాష ప్రచార సాధనాల భాష యాస మార్పుల వల్ల పూర్తిగా మాతృభాషలో ప్రభుత్వాన్ని కోల్పోతున్న మేమో అనిపిస్తుంది. మాతృభాషలోనే ఇంత గందరగోళం ఉంటే ఇక భాషా నైపుణ్యాలు ఎలా మెరుగుపడతాయి. మాతృభాషలోనే వైకల్యం పొందితే. మాతృభాష ప్రామాణికంగా నేర్చుకుని పరాయి భాషలను ఎలా సరళంగా నేర్చుకుంటాం. ఒక భాషలోనే ఇంత గందరగోళానికి గురవుతున్నప్పుడు. బాసపట్ల ఆత్మవిశ్వాసం అధికారం ఎలా పొందగలుగుతామో భాషా శాస్త్రవేత్తలు భాషా పండితులు పిల్లల తల్లిదండ్రులు సమా శ్రీజం ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో!!?
ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం