* హాయిగా... అనుభవించు ! *;- కోరాడ నరసింహా రావు.
సుఖ,సంతోషానందానుభవాలకోసమే... 
    మనిషి తాపత్రయమంతా !

ఇందుకోసమే... ఈ మనిషి 
   నిరంతరాన్వేషణ... !!

జ్ఞానాన్ని వికసింపజేసుకుని.... 
  విజ్ఞానపువినూత్న
                  ఆవిష్కరణలతో 
  ప్రగతి రథమెక్కి పరుగులుతీస్తూ... 
    సముద్రాలను శోధించి... 
  అంతరిక్షాన్ని ఛేదించి.... 
   ఈ వామనుడు త్రివిక్రమునిగా మారినా.... 
     ఇంకా ఏదో వెలితి.... !

ఇంత పొందినా.... తీరని కోరికలు... 
    నెరవేరని ఆశలు... !

పూర్తిగా ఆవహించిన అవివేకం 
   అన్యాయాలు - అక్రమాలు... 
   కక్షలు.... కార్పణ్యాలు.... 
   అశాంతి.... ఆందోళన... !

ఇంక  ఈమనిషికి... సుఖమెక్కడ !?
   సంతోషమేదీ.... ?!

ఓ మనిషీ.... !
   ఎలా మొదలయ్యావ్..., 
     చివరికేస్థితికి చురుకున్నావ్ 

ఆలోచించు...... 
   సావధాన చిత్తుడవై.... !
. గ్రహించు సత్యాన్ని.... !!
   నీవాసించిన నిజ సుఖ, సౌఖ్యానందాలను.... 
    అందరితో కలసి... 
  హాయిగా అనుభవించు !!
       **&***

కామెంట్‌లు