అమ్మచేతివంట (బాలపంచపదులు.)- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 1.
మేలుగా నుడికినట్టి యాహారము
తేలికగా జీర్ణమగు భోజనము
దేహమున కిడుచుండు నారోగ్యము
వేళమించి భుజింప ననారోగ్యము
కలుగుచుండు నీ కాలములో జయ!/
2.
శాకములు చిరుధాన్యములు ఘన
క్షీర, దధియు, ఫలరసంబులన
పౌష్టికాహారమందించు తనువున
కారోగ్యమని పెద్దలు నుడివిన
సూత్రములాచరింపవలెను జయ!//
3.
పాశ్చాత్య ధోరణి విడిచి పెట్టుము
పిజ్జ బర్గర్ల తిండి మాని వేయుము
సమతుల్యమైన దేశీయ పాకము
అమ్మచేతివంట హాయిగా తినుము
సుఖముగా నీవు జీవించుము జయ!//
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం