క్షమించడమే-సద్గుణం.;డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.-9884429899
 భారతదేశ చరిత్రలో సమర్దరామదాసు పాత్ర చాలా కీలకమైనది. ప్రధానంగా అనేక సంకటాలలో అణగారపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో తను ప్రత్యేకమైన వ్యూహాత్మక ప్రణాళికను అవలంబించాడు.శివాజీకి మత గురువు ఛత్రపతి శివాజీ హిందవీ స్వరాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమర్ధ రామదాసు పాత్ర గురుతుల్యమైనది.
1608 చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) రోజు సమర్ద రామదాసు జన్మించారు. మహారాష్ట్రలో ఇప్పటికీ ఈ రోజుని ‘దాస నవమి’గా జరుపుకుంటారు. ఔరంగాబాద్ లోని శంభాజీనగర్కు 100 మైళ్ళ దూరంలోని జామ్ అనే గ్రామంలో ఈయన జన్మించారు. తండ్రి సూర్యాజీపంత్ ఠోసాల్ ఆ గ్రామంలోని శ్రీరామ మందిరంలో పూజారి, తల్లి రాణూభాయి గృహిణి. ఒకనాడు సూర్యాజీ పంత్ శ్రీరామ మందిరంలో భక్తులకు శ్రీరామ జనన ఘట్టం వున్న అద్యాయాన్ని ప్రవచిస్తున్న సమయంలోనే రాణూబాయికి మగసంతానం కలిగిందట. అందుకే సూర్యనారాయణుని ప్రసాదంగా భావించి ఆ బాలుడికి ‘నారాయణ’ అని మొదట పేరు పెట్టారు. అలా నామకరణం జరిగిన రోజు వైశాఖ పూర్ణిమ. తల్లిదండ్రులతో పాటు జామ్ నగరమంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నదట. ఆనందంతో నాట్యం చేస్తూ ఇలా పాటలు పాడారని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
‘దోన్ ప్రహారీకాం గ శిరీ సూర్యథాంబలా - నారోబా జన్మలా గ సఖీ నారోబా జన్మలా’
(సరిగ్గా మిట్టమధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు కాసేపు ఆగిపోయాడు ఎందుకో తెలుసా? నారాయణుడు జన్మించాడు, సఖులారా, నారాయణుడు జన్మించాడు - అని ఆ పాటకు అర్ధం) నారాయణ కంటే మూడుసంవత్సరాలకు ముందు పుట్టి అతనికి అన్నస్థానంలో వున్న వాడు గంగాధర్. పిల్లలు లేరనుకుంటున్న సమయంలో రాణూభాయి, సూర్యాజీల వివాహం అయిన 24 సంవత్సరాల తర్వాత గంగాధర్ పుట్టాడు. ఆతర్వత 3 సంవత్సరాలకు నారాయణ జన్మించాడు.
లోతుగా ఆలోచించడం ఇతనికి చిన్నతనం నుండే అబ్బింది. బాగా అల్లరి చేస్తున్నాడని ఒకనాడు తల్లి కోప్పడితే అలిగిన నారాయణ ఒక రోజంగా చీకటి గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ గడిపుతుండటం తల్లికి కనిపించింది.‘ నారాయణా ! ఏం చేస్తున్నావు నాయనా ( కాయ్ కరతా నారాయణా) అని తల్లి అడిగింది.
‘ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను ’ ( చింతా కర్ తో విశ్వా చీ ) అని ఆ పిల్లవాడు బదులిచ్చాడట. ఈ మాటలువినగానే సన్యాసిగా మారిపోయి తన బిడ్డ ఎక్కడికి వెళ్లిపోతాడో అని ఆ తల్లికి చింత ప్రారంభం అయ్యింది.
సమర్ధరామదాసు తెలంగాణలో కూడా తిరుగాడారు.నిజామాబాదుకి 5 కి.మీ. ల దూరంలో చిన్న కొండమీద వున్న గుడి ఇది. గుడి చిన్నదయినా ఆవరణ విశాలమైనది. చాలా ఆకర్షణీయంగా వుంటుంది. గుడి మొత్తం, ముందు ధ్వజ స్తంభంతోసహా సింధూర వర్ణంతో కనులవిందు చేస్తుంది. ఖిల్లా రఘునాధాలయంలాగానే ఈ ఆలయానికీ, ఛత్రపతి శివాజీకీ సంబంధముంది. ఛత్రపతి శివాజీ గురువైన ఇతను ఆ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆకారాన్ని స్వయంగా గీసి, ఆ రూపురేఖల ప్రకారం విగ్రహాన్ని చేయించి ఇక్కడ స్ధాపించారుట. చుట్టూ మఠాధిపతుల సమాధులు ఉన్నాయి.
పరమాత్మ చెట్టు యొక్క జీవశక్తి లాంటివాడు. దానివలన చెట్టు ఏర్పడుతుంది, జీవిస్తుంది, పెరుగుతుంది. అదే పువ్వు కాయ కొమ్మ ఆకులలో వ్యక్తం అవుతుంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రయోజనం కల్గియుంటుంది. కాని అన్నీ ఆప్రాణ రూపమే. దేవతలంతా ఇటువంటి వృక్ష భాగాలు పరమాత్మ ఆ వృక్షం యొక్క ప్రాణం దాని రూపం సద్గురువు. అసలు సమర్ధ రామదాసు 'దాసబోధ ' లో అంటారు. "సద్గురువును కొల్చేవారు వేరే దైవాలను కొలవనక్కర్లేకపోవడమే కాదు, కొలవడం అనుచితం కూడా ముక్తి నివ్వగల సద్గురువును కొల్చాక" అని అంటారీయన.
సమర్ధ రామదాసు  ఛత్రపతి  శివాజీ మహారాజ్ గురువు. ఆయన  తన  శిష్యులతో కలసి శివాజీని చూడటానికి  వెళుతూ,ఎండవేడికి  తాళలేక  ఒక పెద్ద వేపచెట్టు నీడన విశ్రమించాడు.అక్కడికి  చేరువలో  చెరుకు  తోట ఉంది. కాని  దాని  యజమాని  అక్కడ  లేడు,ఆకలిగా  ఉన్న శిష్యులు  చెరుకు తోటలో  ప్రవేసించి  తలా ఒక  చెరుకు గడ తుంచుకుని తింటూ, నిద్రిస్తున్న గురువు పక్కన ఒ చెరుకు గడ ఉంచారు. అక్కడకు వచ్చిన చెరకు తోట యజమాని ఆసంఘటన చూసి కోపంతో ఊగిపోతూ,గురువు గారి పక్కన ఉన్న చెరుగడ చేతపట్టి గురువు గారికి వాతలు తేలేలా కొట్టాడు.మౌనంగా భరించాడు  గురువు గారు.
సాయంత్రం శివాజీ రాజ్యసభలో ప్రవేసించిన  సమర్ధరామదాసును  చూసిన  శివాజీ సాదరంగా ఆహ్వనించి తన సింహాసనం పై కూర్చోపెట్టి  ఉపచారాలు  చేసి.తన రాజ్యం యావత్తుధారపోస్తూ ఒక రాగిరేకు పై రాసి గురువు పాదాలకు అర్పించాడు."స్వామి ఈరాజ్యం,అంతా తమదే  స్వికరించండి" అన్నాడు.
"సంతోషం రాజా నీగురుభక్తి  మెచ్చదగినదే! కాని పరిపాలనా బాధ్యతకు నీవే సమర్ధుడవు" అన్నాడు. గురువుకు పాదాభివందనం చేస్తు, అతని  కాలిపై  ఉన్న గాయాలు  గమనించి, శిష్యులను  విచారించి చెరకు తోట  విషయం తెలుసుకున్నాడు శివాజీ.
మరుదినం  చెరుకుతోట  యజమానిని  బంధించి రాజసభలో ప్రవేశ పెట్టి "గురుదేవా  మిమ్ము ఇంతగా శ్రమపెట్టి  అవమాన పరిచిన ఈవ్యెక్తికి మీరే తగిన శిక్ష విధించండి"అన్నాడు శివాజీ.
అప్పుడు సమర్ధ రామాదాసు "రాజా  ఆ చెరుకు తోట  యజమాని  ఏటా మనకు కట్టే శిస్తు రద్దు  చేయడమే అతనికి విధించ వలసిన శిక్ష"అన్నాడు. తన గురువు క్షమా నిరతికి దయా గుణా నికి శిరస్సు వంచి నమస్కరించాడు శివాజీ.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం