అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామంనెల్లూరు.6302811961.
 చెట్టు కింద చాళుక్య శివలింగం కాకతీయ నాగశల్పం కోనేరు గోడకు ఆణించిన చాముండి భద్రకాళి అద్భుత శిల్పకళా నైపుణ్యం కల చెన్నకేశవ వేణుగోపాల అర్ధ స్వస్తిక విగ్రహాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు చుట్టు గడ్డీ గాదం పైనుంచి కాకి రెట్టలు నోరు లేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ విగ్రహాలు ఎంతగా మొత్తుకొని ఉండేవో  అక్కడే అల్లంత దూరంలో మూలముద్రంలో ఉన్న కాకతీయ ప్రతాపరుద్దురుని కాలపు (క్రీస్తుశకం 1296) శాసనాన్ని స్పృశించి పరవశించిపోయారు రెడ్డి గారు. పోనుమ్ గోపుర వరాధీశ్వరుడైన నాచయ రెడ్డి గారి కొడుకు  కాకెత రాజ్య స్థాపన ఆచార్య మాదియ రెడ్డి గారు  దుద్దెడ స్వయంభూ దేవరకు ఆ ఊరి అడ్డపడ్డ పెంట సొంకాలను చెల్లించిన విషయాలను తెలుసుకున్నారు గారికి సిద్దిపేటకు చేరుకున్నారు అహోబిలం కరుణాకర్ గారి ఇంట్లో భోజనాలు ఆయన శ్రీమతి పిల్లలు ఆతిథ్యానికి అర్థం చెప్పి ఆదరణకు మారుపేరు అనిపించుకున్నారు కరుణాకర్ చుట్టూ ప్రక్క గ్రామానికి సేకరించిన కొత్త రాతియుగపు గొడ్డళ్లు ఇనుప యోగ పువ్వు నలుపు ఎరుపు మట్టి పాత్రలు చారిత్రక తొలి యుగపు మట్టి బొమ్మలు కొండ పెంకులు మట్టి పూసలు ఒకటేమిటి ఆదిమానవుని అడుగుజాడల్ని అదిమి పట్టుకున్న ఆనవాళ్లను ఓడిసి పట్టుకొని చరిత్రను కాపాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగించింది వారికి  అరటి ఆకులను పరచి చామ ఆకులతో శనగపిండితో తయారు చేయించిన  ఒక వంటకాన్ని వారికి వడ్డిస్తే ఇది వారికి చాలా కొత్తయినా ఆయుర్వేద ఆహారం కావటం ఔషధ గుణాలు ఉండటం చాలా రుచిగా అనిపించింది. తక్కాలి పులుసు టమాట పప్పు కందా దోస సొరకాయ దప్పలం కంది నూక పచ్చడి తెలంగాణ వడియాలు, ఊరమిరపకాయలు, ఆవకాయ కమ్మటి వాసన వెదజల్లుతున్న ఆవు నెయ్యి పాయసం, మజ్జిగ చారు, రైతా బంగార అన్నం తెల్ల అన్నం పప్పుల పొడి, దొండకాయ వేపుడు తీరాంతలను మరిపించేట్లు మరగబెట్టిన పాలతో తయారైన పెరుగు దానిలో నంజుకోవడానికి వంకాయ వరుగులు ఎలా కొన్నిటిని కొసరి కొసరి వడ్డించిన అన్నం తిన్న రెడ్డి గారు సామలైటి మహేష్ జై అందిస్తే గాని పైకి లేవలేకపోయారు. ఎవరో చెప్పితే కానీ విన్న బుక్తాయాసం అనే మాట  తాను అనుభవించిన తర్వాత ఆ మాట నిజమే అనిపించింది రెడ్డి గారికి  కరుణాకర్ గారింట ప్రక్కన ఆలయంలో భైరవశిల్పాలు పీఠం పైన తెళ్ల బొమ్మల్ని చూశాడు కల్యాణ చాళుక్య తాలూకు గమ్మత్తయిన జటాజూటాలను కలిగి ఉన్నాయి అక్కడినుంచి సిద్దిపేటలోని పురాతన భోగేశ్వర స్వామి ఆలయ శిథిలాలను శిథిల మండపం లోనే కబుర్లు చెప్పుకుంటున్న యువకులు బయటి వరస రాళ్లు పడిపోయిన శివాలయం  ప్రక్కనే కాకతీయులకు దీప పుస్తకం భైరవ చెన్నకేశవ సప్తమాతలు శివలింగం నంది వరుసగా పాచన నాగదేవత మహిషాసుర మర్దని శిల్పాలు ఆలనాపాలనా లేక ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నాయి.


కామెంట్‌లు