తిరుప్పావై ; - 7 పాశురము- వరలక్ష్మి యనమండ్ర, అద్దంకి, బాపట్ల జిల్లా.
కీశు కీశెవైజ్ఞుమానై చాత్తకలను ! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణి ! కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేరు: వాశ నరుజ్జుళ లాయిచ్చియర్ మత్తినాల్ ఓపడు రవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.
***********
7వ పాశురం భావము- పంచపది ప్రక్రియలో
23-12-2023...శనివారం
***********
తెల్లవారెను కదా తెలియలేదా చెలీ
పక్షుల రవములు వినలేదా.  చెలీ
చిన్ని కృష్ణుని కథలు వినలేదా చెలీ
స్వామి పూజకు మాతో చేరవే చెలీ
పక్షుల కిలకాలలు వినవే ఓ చెలీ... లక్ష్మీ

నంద వ్రజాంగనలు చల్ల చేయు సవ్వడులు
వారి చేతుల  గాజుల గలగలల శబ్దములు
మెడలోని ఆభరణముల  వింతవింత సవ్వడులు
నీవు వినలేదా కృష్ణుని కళ్యాణ గుణములు 
పాటలను వింటూ నిదురించితివా చెలీ.. లక్ష్మీ

స్నాన వ్రతమునకు బయలుదేరు చేలీ 
కేశవుని సేవకు వేళాయెనుగా చెలీ ఇక నీవు నిదుర లెమ్ము నిజంగా చెలీ
వన్నెచిన్నెలదానా నీవు నిదురలే చెలీ
అందమైన మోముదాన తలుపు తీయవే చెలీ.. లక్ష్మీ
***********


కామెంట్‌లు