ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు ఏ.బి ఆనంద్,=ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,=9492811322
 నేను 7-8వ తరగతి చదువుతున్న రోజుల్లో మా గ్రామం లో మనోహర్ చిత్రం చూశాను ఆ చిన్న వయసులోనే ఈ పాత్రను మరెవరు ఇంత గొప్పగా పోషించలేరు అని అనిపించింది నాకు అప్పటినుంచి నేను ఆయనకు వీర అభిమానిని నేను చేస్తున్న పని చూసి ఆనందించి తనను పరిచయం చేసుకున్నారు మాటల సందర్భంగా నటన గురించి మాట్లాడుకుంటూ మీ అరవ సోదరులకు అరవకపోతే నచ్చదా అని అడిగాను శివాజీ గణేషన్ గారిని  దానికి వారేమీ సమాధానం చెప్పకుండా జేబులో నుంచి 20 రూపాయల నోటు తీసి ఇచ్చి చెన్న పట్నంలో నా చిత్రం ఎనిమిది సినిమా హాల్స్లో ప్రదర్శించబడుతోంది (పాలాడై) వెళ్లి ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు వాడు చెప్పినట్లుగానే వెళ్లి ఆ సినిమా చూసి అమందానందంలో తేలియాడుతూ వారి ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి తెలుగు తమిళ కన్నడ మలయాళం సినిమా రంగాలలో ఏ ఒక్కరు ఈ పాత్రను ఇంత గొప్పగా పోషించలేరు ఒకవేళ ఈ పాత్ర అనుసరించవలసి వస్తే భారతదేశం మొత్తం మీద అశోక్ కుమార్ గారు తప్ప మరొకరు సరిపోరు అని నా మనసులో మాట చెప్పాను
శివాజీ గణేషన్  గారు ఎంతో సంతోషించి వారి శ్రీమతి గారిని పిలిచి పరిచయం చేసి సకల మర్యాదలు చేసి  భోజనాలు చేసిన తర్వాత వారి కారులో నన్ను మా ఆఫీసుకు పంపారు ఇలాంటి అరుదైన విషయాలు జీవితాంతం జ్ఞాపకం ఉంచుకోవలసిన సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. శివాజీ గణేషన్ గారి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది వారు సినిమాల్లోకి రాకముందు రంగస్థలం నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు ప్రత్యేకించి ఛత్రపతి శివాజీ నాటకం అంటే వారికి మహా ఇష్టం నాటకం మధ్యలో గుర్రం మీద ఆయన వేదికపై వచ్చి  అందరిని ఆశ్చర్యపరిచారు ఒక పర్యాయం పృథ్వి రాజ్ కపూర్ ను బొంబాయి నుంచి నాటకానికి ఆహ్వానించారు వారు నాటకం చూసి శివాజీ గణేషన్ అని నామకరణం చేశారు వారి మీద గౌరవంతోనే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు
అంజలి పిక్చర్స్ పేరుతో తయారైన పరదేశి చిత్రంలో అంజలీదేవి నాగేశ్వరావు గారు పుత్రుడిగా నటించాడు శివాజీ  అప్పటినుంచి నాగేశ్వరావు గారిని నాన్నగారు అని పిలుస్తూ ఉంటారు వీరు జెమినీలో నటించిన మొదటి చిత్రం పరాశక్తి జెమినీ వాసన్ గారికి అతను నచ్చకపోయినా దానిలో శివాజీ నటన భరించరానిదిగా ఉందని మరొక నటుడుతో ఆ సినిమా తీయమని దర్శకుడికి చెప్పినా ఏసీ త్రిలోక్ చంద్ర గారు తన పేరుతో ఆ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తే 100 రోజులు ఆడింది  శివాజీ గణేషన్ నటన ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా  ఉంటుంది ఈ పాత్ర చేయడానికి ఆయన ఉత్సుకత చూపిస్తారు అందుకు ఉత్తమ పుత్రన్ కోటేశ్వర్ లాంటివి ఉదాహరణలు ఉత్తమ పుత్రన్ లో ద్విపాత్రాభినయం చేస్తే కోటేశ్వర్ లో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు  అలాంటి వారి మెప్పు నేను పొందడం జీవితంలో నా అదృష్టంగా భావిస్తున్నాను.


కామెంట్‌లు