ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 కపిలేశ్వరపురంలో సంస్కృత కళాశాల ఉంది అక్కడ అక్క పెద్ది శ్రీరామ శర్మగారు హరికథ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వారికి నాన్నగారు నేర్పిన హరికథ  ఎలా ప్రారంభించాలి అందమైన ఉదాహరణలతో ప్రజల మనసులను హత్తుకునేట్లు ఎలా  కథను నడిపించాలి  చివరకు దానిని ఎలా ముగించాలో  తెలియజేశారు  అక్కడ కళాశాలలో ఉన్న విద్యార్థులతో  కదంబ కార్యక్రమాలను కూడా ఆకాశవాణి కోసం రికార్డు చేశాను  అక్కడ పనిచేస్తున్న  సంచాడుకులను నాకు పరిచయం చేస్తే  ఆనంద గారిని  వెంకట్ రాజు గారిని నాకు పరిచయం చేయడం ఏమిటి  విజయవాడలో నా కార్యక్రమాలన్నీ ఆనంద గారే చేసేవారు  నా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు రాజుగారు చూస్తారు  వారు నాకు కొత్త కాదు కదా అన్నారు. నేను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో  గణపతిరాజు అచ్యుతరామరాజు గారితో పరిచయం ఏర్పడింది  ఒకరోజు ఏకపాత్రను  అభినయించడానికి వచ్చినప్పుడు ఒకటి రెండు తప్పులు ఉంటే  అవి నేను సరి చేయడం  ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది  ఇలా సరి చేసినవారు ఇంత వరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఎవరూ లేరు  ప్రస్తుతం మీరు వచ్చారు  ప్రతి వారి దగ్గర చొరవ తీసుకుని చెప్పగలిగిన సత్తా  చెప్పే పద్ధతిలోమృదుత్వం  మీ కంఠానికి  సహజంగా ఉంది కనుక వినేవాడు కూడా  ఎలాంటి విసుగు చెందకుండా వింటారు  అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం  అన్న తర్వాత అనేక నాటక పరిషత్తుల్లో  వారు న్యాయ నిర్ణేతలుగా వెళ్లే సమయంలో నన్ను కూడా తీసుకు వెళ్ళేవారు  వారితో వెళ్ళినప్పుడు  న్యాయ నిర్ణీత ఎలా ఉండాలో న్యాయాన్ని ఎలా చెప్పాలో  వారి దగ్గర నేను నేర్చుకున్నాను. తర్వాత ఒకరోజు మాటల సందర్భాల్లో నా కార్యక్రమాల గురించి చెబుతూ వ్యక్తిగతంగా నా  గ్రంథాలయానికి  మీ అనుభవాలు కావాలి అని అడిగితే ఆయన అంగీకరించారు  నేను నా సహచరుడు లైబ్రరీయన్ పనిచేస్తున్న శేఖర్ ని తీసుకుని వెళ్లాను చక్కటి మర్యాదలు  జరిగిన తర్వాత  వారి అనుభవాలు  నిజానికి విశాఖపట్టణానికి నాటకాన్ని పరిచయం చేసింది రాజుగారు  అప్పట్లో పౌరాణిక నాటకాలకు ప్రథమ స్థానం ఉండేది  రాజుగారికి  వారి ఆకారానికి సరిపడినట్లుగా చక్కటి పాత్రలను పోషించేవారు  దానికి తగిన గాత్రం వారికి ఉంది  ఆయన ప్రత్యేకంగా ఒక నాటక సంస్థను స్థాపించి  కొత్తవారికి శిక్షణ ఇచ్చి నాటకాలు రాయడానికి  దర్శకత్వ బాధ్యత వహించడానికి  అతనికి ఎలాంటి అనుభవం ఉండాలి  ఏ పాత్రలో ఎలా నటించాలి అన్న విషయాలను అన్నిటిని  వారికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పేవారు.

కామెంట్‌లు