జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు సాహితీ పరంగా వారి గురించి తెలియని వారు అరుదు. ఆయన జీవితం అన్వేషణతోనే గడిచింది వేమన పద్యాలను వెలికి తీసి వాటి పూర్వాపరాలను తెలుసుకొని బ్రౌన్ గారికి సహాయపడిన రెడ్డి గారి జీవితాన్ని కూడా పరిశీలనాత్మక దృష్టితో కడపలో బ్రౌన్ గారి పేరుతో చక్కటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వారికి సంబంధించిన జీవిత విశేషాలు అన్నిటిని కూడా దానిలో పొందుపరచడం జరిగింది ఆయనతో కలిసి నేను నాన్నగారు వారి జీవిత చరిత్ర మొత్తం వారితో చెప్పించడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది వేమనను గురించి తెలుసుకోవాలన్న అభిప్రాయం కట్టమంచి రామలింగారెడ్డి గారి రచనల ద్వారా కలిగింది అని ఆ అన్వేషణలో తాను చేసిన సేకరించిన విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా చెప్పారు అది చరిత్రకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉషశ్రీ గారి పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు వారు పత్రికా రంగంలో ఉన్నప్పుడు కలం పేరుగా ఉషశ్రీ అని మార్చుకున్నారు వారి నాన్నగారు పురాణపండ రామ్మూర్తి గారు భారత రామాయణ భాగవతాలను రాజమండ్రిలో ఉపన్యాసాలుగా ఒక రోజు మూడు గంటలు నిలబడి చెప్పేవారు వారు రాసిన రామాయణం భారతం మొత్తం ఉషశ్రీ గారు మేలి ప్రతి తయారు చేయడంతో ఆకాశవాణిలో ధర్మసందేహాలు పేరుతో ఎవరికి ఏ విధమైన అనుమానాలు వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉండేవారు వారి తమ్ముడు రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో నివాసం ఏర్పరచుకొని సనాతన ధర్మానికి సంబంధించిన సాహిత్యం మొత్తాన్ని సాధ్యమైనంత వరకు తన భాషలో వ్రాసి దానిని పుస్తక రూపంలో ప్రచురించి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు.
నేను నాన్నగారు రాజమండ్రి వెళ్లి రాధాకృష్ణమూర్తి గారిని కలిసి వారి నిత్య కార్యక్రమాలను గురించి అడిగినప్పుడు ఈ జీవితం అమ్మవారి సేవలో గడిచిపోతుంది ఆమె ఎలా చెబితే అలా నడవడం నా జీవిత ఆశయంగా ఎంచి అనుసరిస్తూ వస్తున్నాను అనుక్షణం అమ్మ నామస్మరణ తప్ప నాకు మరే ధ్యాస ఉండదు జీవితంలో సాధ్యమైనంత వరకు ఇతరులకు సహకరిస్తూ వారి మంచి కోసం పాటుపడాలి అన్న అభిప్రాయం దృఢంగా ఉండడంతో దానికోసం ఏం చేయాలి అని ఆలోచించి వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణంలో సామాన్య ప్రజలకు అవసరమైన హితాన్ని స్వీకరించి దానిని పుస్తక రూపంలో అందరికీ ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను అలాగే అమ్మవారి చరిత్ర పూర్వాపరాలను ఆమెను నమ్మడం వల్ల వచ్చే లాభాలను తెలియజేయడమే జీవిత ధ్యేయం అని భావిస్తూ అలా నడుస్తున్నాను అని చెప్పారు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి