ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,9492811322.
 నాన్నగారు రాజుగారు అతి సన్నిహిత ఆత్మీయ మిత్రుడు  మాచినేని వెంకటేశ్వర్లు  ఇద్దరికీ వామపక్ష భావాలు నచ్చి ఇద్దరూ పార్టీలో నిజాయితీగా పనిచేసిన వారు  చాలా కాలం పని చేసిన తర్వాత దానిలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన  పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా  జీవిస్తున్న వారిని చూసి రాజుగారు  నాన్నగారు పార్టీని వదిలి  స్వచ్ఛందంగా సేవ చేయడం ప్రారంభించారు  మాచినేని వారు డాక్టర్ రాజారావు గారితో కలిసి  పార్టీలో సాంస్కృతిక విభాగంలో  నాటకాల ద్వారా ప్రజలలో పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడానికి  ప్రయత్నం చేస్తూ  ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా  సుంకర సత్యనారాయణ  గారిని  రచయితగా ఎన్నుకొని రాజారావుగారు తానే చెప్పిన  అంశాన్ని గురించి నాటకాన్ని వ్రాయించుకునేవారు.
డాక్టర్ రాజారావు గారు  నాటకాన్ని ప్రారంభించే ముందు మాచినేని వారికి అన్ని విషయాలు చెప్పి  తనకు కావలసిన పద్ధతిలో మాచినేని గారి ద్వారా దర్శకత్వ నిర్వహణ చేయించి  మంచి ఫలితాలను రాబట్టారు  అనేక కొత్త నాటకాలకు జీవాన్ని పోసింది  వారే  వేదికపై నటించే నటీమణుల కొరత ఉన్నప్పుడు  కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలలో ఉన్న  అభిరుచి గల పిల్లలను  తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఉత్తమ నటీమణులుగా తీర్చిదిచ్చినవారు. డాక్టర్ రాజారావు గారు  వారి  శిక్షణలో మాచినేని గారు  బుర్రకధని చెప్పేవారు చిత్ర విచిత్రమైన  జానపదాలను సామాన్య ప్రజలకు ఇష్టమైన పద్ధతిలో  ప్రదర్శించడంలో దిట్టగా  మంచి పేరు సంపాదించుకొని అనేకమంది నూతన  నటీనటులను తయారు చేశారు.
విజయవాడలో క్రాంప్టన్ సంస్థ  యజమాని సత్యనారాయణ గారికి నాటకాలు అంటే చాలా ఇష్టం  చెన్నైలో చో వ్రాసిన తమిళ నాటకాలను  హక్కులతో సహా తీసుకుని వచ్చి తన శ్రీమతి  సరస్వతి ద్వారా అనువదింప చేసి దర్శకత్వ బాధ్యత మాచినేని వెంకటేశ్వరరావు గారికి అప్పగించారు  ఇవాళ సినీ రంగంలో అనేక  సినిమాలలో నటించి రాణించమే కాక తనకు నచ్చిన అనేక సినిమాలను నిర్మించిన నిర్మాత కూడా విజయవాడలో వ్యాపారం చేసుకుంటూ  రాజబాబు అన్న యువకుడు సినీ రంగ ప్రవేశం చేసి అప్పటికే ఆ రంగంలో రాజబాబు ఉండడం చేత తన పేరుని మురళీమోహన్ గా మార్చుకుని  మంచి నటునిగానే కాక మంచి వ్యక్తిగా జెంటిల్మెన్ ఆఫ్ ది ఫీల్డ్ అంటూ  అందరి ప్రశంసలను పొందిన వాడు.




కామెంట్‌లు