గుంటూరు జిల్లా నూతక్కి గ్రామ వాస్తవ్యుడు శివరామిరెడ్డి గారు చిన్నతనం నుంచి నాటాకాలంటే కావాలంటే ఎంతో ఉత్సాహంతో ముందు ఉండేవాడు తర్వాత కే వెంకటేశ్వరరావు గారితో కలిసి ర. స.న సంస్థను స్థాపించి అనేక నాటకాలను ప్రదర్శించారు వెంకటేశ్వరరావు గారి బాణి రెడ్డి గారికి నచ్చక స
తాను ప్రత్యేకంగా నాటకాలను ప్రారంభించాలన్న అభిప్రాయంతో వారి అనుమతితో కొత్త సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించి పల్లెటూళ్ళలో నాటకాలను వ్యాప్తి చేయాలి అన్న అభిలాశతో నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవాడు.అసలు నాటకం అంటే ఏమిటో తెలియని పల్లె వాసులను అనేక మందిని ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి ఉత్తమ నటులనుగా తీర్చిదిద్దిన వాడు శివ రామిరెడ్డి గారు. నాన్నగారి ద్వారా వారు నాకు పరిచయం అయ్యారు నేను కళాశాలలో చదువుతున్న రోజుల్లో అందరూ బ్రాహ్మణులే నాటకాలు వేసేవారు ఆ పరిస్థితులు నాకు నచ్చక కాలేజీలో చదువుతున్న గుంటూరు జిల్లా నూతక్కి గ్రామ వాస్తవ్యులు రామిరెడ్డి జోన్నపాడు నుంచి వచ్చిన రాఘవరెడ్డిల సహాయంతో నాటకాలను కళాశాలలో ప్రదర్శించడం ప్రారంభించాం విశాఖపట్నంలో ఇంటర్ కాలేజీయేట్ నాటక పోటీలకు మా వారు రామచంద్ర కాస్యప రామన్న పంతులు గార్లను దర్శకులుగా తీసుకువస్తే అప్పుడు మాకు అనుకూలంగా ఉన్న కళాశాల ప్రిన్సిపల్ రామారావు గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి వారి అనుమతి తీసుకుని శివరామిరెడ్డి గారిని దర్శకునిగా ఎన్నిక చేసి వారిని పిలిచి వారి నిర్వహణలో నాటకాలు వేయడం ప్రారంభించాం.
నేను ఆకాశవాణికి వచ్చిన తర్వాత శివరామిరెడ్డి గారు మా ఆస్థాన రచయిత కొడాలి గోపాల్ రావు గారితో చైర్మన్ లో కొన్ని మార్పులు చేసి దానిలో నన్ను నాన్నగారిని తండ్రి కొడుకులుగా నటింప చేసి రెడ్డి గారు ముసలయ్య పాత్ర వేస్తూ దర్శకత్వ బాధ్యత కూడా తీసుకున్నారు అలా అనేక పర్యాయాలు నాటకాన్ని ప్రదర్శించిన తరువాత కొడాలి గోపాల్ రావు గారు రాసిన నాలుగైదు నాటకాలను వారి దర్శకత్వంలో వేయడం వారి బాణీ నచ్చి వారిని ఆకాశవాణి నాటక శాఖలో నటుడిగా ఎన్నిక చేయించాను ఆకాశవాణిలో కూడా నాతో పాటు అనేక నాటకాలలో గాత్రధారణ చేశారు. మాచినేని వెంకటేశ్వరరావు గారు నాకు ఎప్పుడూ ఆకాశవాణి నాటకాల్లో ప్రతి నాయకునిగా ఉండేవారు నాకు దర్శకులుగా ఉన్న వారిద్దరికీ నేను దర్శకుడుని రేడియోలో వారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి