పెద్దలను గౌరవించాలి!!...;- -గద్వాల సోమన్న,9966414580
పెద్దల యెడల ఉండాలోయ్!
భయభక్తులతో  నిరంతరం
గౌరవభావం పండాలోయ్!
అది అత్యంత మనోహరం

ప్రథమ స్థానమే ఇవ్వాలోయ్!
ప్రతి దానిలో ఉన్నతంగా
కుటుంబంలో కొలవాలోయ్!
పెద్దవారిని దైవంగా

పెద్దల మాటలు వినాలోయ్!
బ్రతుకులు దిద్దుకోవాలోయ్!
మంచిని వారిలో కనాలోయ్!
ఆదర్శంగా నిలవాలోయ్!

చులకన భావం పోవాలోయ్
చీదరింపు మానుకోవాలోయ్
సదనాన ఆశీర్వాదాలు
ప్రగతి బాటలో కుటుంబాలు


కామెంట్‌లు