అంగీకారామా!!;- -గద్వాల సోమన్న,9966414580
తోటలోకి వెళుదామా!
ఆటలను అడుదామా!
మాటలెన్నో చెపుతూ
పాటలను పాడుదామా!

పూవులను చూద్దామా!
సువాసనలు  పీల్చుదామా!
అందాలు తిలకిస్తూ
బంధాలు కలుపుదామా!

కఠినత్వం వీడుదమా!
పువ్వుల్లా మారుదామా!
నలుగురికి సాయపడుతూ
ఆదర్శం చూపుదామా!

త్యాగాన్ని చాటుదామా!
స్వార్ధాన్ని వదలుదామా!
పూలతోట రీతిలో
సేవలెన్నో చేద్దామా!


కామెంట్‌లు