సాధ్యమేనా?;- -గద్వాల సోమన్న,9966414580
ఉదయించే కిరణాలను
ఎగసిపడే కెరటాలను
ఎవరైనా అపగలరా!
సుమాల సువాసనలను

నింగిలోని తారకలను
తలలోని వెంట్రుకలను
లెక్కించే దమ్ముదా!
చిన్నచిన్న రేణువులను

చలించే మనసులను
అతి సూక్ష్మ జీవులను
ఎవరైనా నిలుపగలరా!
ప్రసరించే వాయువులను

ప్రకృతి వైపరీత్యాలను
వ్యాపించే వదంతులను
ఆపడం సాధ్యమేనా!
మనిషి జనన మరణాలను


కామెంట్‌లు