తిరుప్పావై ;-9వ పాశురము, ;- వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్ దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్ ఊమైయో అన్జి చ్చెవిడో అనందలో ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాలో మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్టెన్టు నామం పలవుం నవిన్జేలోర్ ఎంబావాయ్.
***********
9 వ పాశురం-భావం-పంచపదులలో
***********
9వ పాశురము భావము

నాల్గవ గోపికను నిదుర లేపుదము చెలులారా
ఆమెవద్ద  నవవిధభక్తులు నేర్చెదము చెలులారా
మణిమయ నిర్మిత పవిత్ర భవనమది చెలులారా
అంతటా దీపపు వెలుగులు ఉన్నవిగా చెలులారా
ఆ గోపికను నిదుర లేపుదము రారండీ చెలులారా... లక్ష్మీ

పరధ్యానములో నీవున్నావా పలుకవేమి  ఓ చెలీ
వినబడలేదా మౌనమేలనే పలుకవదేమీ ఓ చెలీ
బదులీయవమ్మ బంగరుతల్లీ నిద్దురవీడవే ఓ చెలీ
మామకూతురా లేవమ్మా తలుపు తీయవే ఓ చెలీ
హంస తూలికా తల్పము పైపవళించావా ఓ చెలీ.. లక్ష్మీ

వైకుంఠ వాసుడు ఆ శ్రీనికేతుడు, శ్రీకృష్ణుని ఓ చెలీ
వింత చేష్టలను చేసేవాడు అల్లరి కృష్ణుని ఓ చెలీ 
ఆదిదేవుని నామావళిని కీర్తించుచుంటిమి ఓ చెలీ
వినపడలేదా భక్తి భజనలు, కీర్తనలు నీకు ఓ చెలీ
మణులు పొదిగినా గడియు తీయుమా ఓ చెలీ.. లక్ష్మీ
***********


కామెంట్‌లు