మూడు తరాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆచెట్లు మూడు తరాలకి చెందినవి.ఆపెద్దచెట్టు అంది" నాకు 100 ఏళ్ళు.ఇక తనువు చాలించి వేరే ఆకారంలోకి మారాలి అనుకుంటున్నాను." అంతే అక్కడ విహరిస్తున్న తథాస్తు దేవత అలాగే అంది.అంతే ఒక వ్యాపారి ఆచెట్టుని కొట్టేయించి ఊయలలు తయారు చేయించాడు.తన మనవలు అందులో పడుకుని బోసి నవ్వులు కురిపిస్తోంటే హాయిగా అనిపించింది ఆపెద్ద చెట్టుకి.రెండో చెట్టు అనుకుంది" నాకు దేశ మంతా తిరగాలని ఉంది.ఇలా ఒకేచోట ఉండడం విసుగ్గా ఉంది." తథాస్తు దేవత వల్ల నావికులు వచ్చి దాన్ని కొట్టి పడవలుగా మార్చడంతో ఆచెట్టు సంతోషించింది.మూడో చెట్టు అనుకుంది " రకరకాల డిజైన్లు ఆకారాల్లో అందరినీ ఆకట్టుకోవాలి అని ఉంది."తథాస్తు దేవత దయవల్ల ఆచెట్టుని కలపవ్యాపారి రకరకాల ఆకారాలతో కుర్చీ బల్లలు పీటలు స్టూల్ చేయించాడు.మన పూర్వజన్మ సుకృతం దైవానుగ్రహం వల్ల మనం వివిధ వృత్తులు సుఖసంతోషాలు అనుభవిస్తాము.ఎప్పుడూ సకారాత్మకంగా ఆలోచిస్తూ మంచే చేయాలి.ఇంకోరికి మంచి చేయాలి అని ఆలోచించాలి.అప్పుడు దేవుడు అడుగుకుండానే మంచి చేస్తాడు🌹
కామెంట్‌లు