* కోరాడ బాలగేయాలు !

...@ గొప్పగా  చెప్పు కోవాలి !!
.        ************************
తమ్ముడూ.... ఇదేమిటో 
  తెలుసా... నీకు... 
  దీనిని  అట్లాస్ అని అంటారు 
  మన భూగోళానికి నమూనా గా... దీన్ని తయారు చేశారు !

ఎక్కడ ఏ దేశం ఉందో... 
  దేని ప్రక్కన ఏదుందో... 
 ఎక్కడ ఏ సముద్రముందో 
  ఏ ఏరెటు పారుతుందో..... 

సులువుగా తెలిసుకునేలా 
 చక్కగా  బోధ పడేలా... 
 రూపొందించి అందించారు 
 మన మానవ మేధావులు !

మన విజ్ఞాన వికాసం కొరకు 
ఎన్నెన్నో  విషయాలను... 
 పుస్తకాల రూపం లో.... 
 పొందుపరచి ఉంచారు... !!

మనం శ్రద్ధతో బుద్దిగచదవాలి 
 అన్నీ   తెలు

సు కోవాలి.. !
 ఋణం తీర్చు కొనేలా.... 
  మనమేదైనా కనిపెట్టాలి  !!

వారినిపుడు  గొప్పగా... 
  మనం చెప్పు కునేలా.... 
 మనల గూర్చి ఈ లోకం 
 గొప్పగ చెప్పు కోవాలి... !
..  గొప్పగా  చెప్పుకోవాలి !!
కామెంట్‌లు