విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివారం వాగ్దేవి కళాపీఠం విజయవాడ కవన వేదిక వారి తృతీయ వార్షికోత్సవ వేడుకలలో జరిగిన కవి సమ్మేళనంలో నంద్యాలలోని జల వనరుల శాఖకు సంబంధించి తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న కవయిత్రి మరియు కవిశ్రేష్ట బిరుదాంకితయైన ఎస్. రత్నలక్ష్మి పఠించిన సీతాదేవి వచన కవితకు అపూర్వ స్పందన, మన్ననలు లభించాయి. ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్తల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ సందర్భంగా వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులైన కవిశ్రీ పండిత డా. శ్రీమాన్ గానుగల యుగంధరాచార్యులవారు, ప్రముఖ పద్యకవి కార్యక్రమానికి ముఖ్య అతిథులైన అసమాన అవధాన సార్వభౌమ కాశీకవి బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మరియు తెలుగు పండితోత్తములైన ఆగమ ప్రవర శ్రీమాన్ పరాశరం వెంకట రమణాచార్యులు, తెలుగుభాషా పరిశోధకులు మరియు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులైన కళారత్న డా. జీ.వీ. పూర్ణచందు, పామర్రు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు భాషోపన్యాసకులు డా. కె.ఆర్.జి.శేషు కుమార్, తపస్వి శ్రీ పంతుల వెంకటేశ్వర్లు తదితర అత్యున్నత సాహితీవేత్తల సమక్షంలో వారి స్వహస్తాలతో ఘనంగా సాహిత్యరత్న బిరుదాంకిత ఎస్. రత్నలక్ష్మిని అందమైన శాలువాతో, బహు సుందరమైన జ్ఞాపికతో, అమూల్యమైన ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సాహితీ ప్రముఖులు, కవివరేణ్యులు, కవయిత్రులు మరియు సాహితీ ప్రముఖులు రత్నలక్ష్మిని అభినందిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
కవయిత్రి కవిశ్రేష్ట బిరుదాంకితయైన ఎస్. రత్నలక్ష్మికి అభినందనలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి